5 Kidneys Man : ఒక వ్యక్తిలో ఐదు కిడ్నీలు.. రెండు సొంతానివి.. మరో మూడు..?

ఎవరికైనా కిడ్నీలు ఎన్నుంటాయి అంటే రెండు అని ఎవరైనా చెప్పేస్తారు. చాలా అరుదుగా ఒకే కిడ్నీతో జన్మించినవారు కూడా ఉన్నారు. కానీ తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల వ్యక్తి శరీరంలో ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. ఈ ఐదు కిడ్నీలు అతనికి పుట్టుకతో రాలేదు. ఈ ఐదు కిడ్నీల్లో రెండు అతని సొంతానివే..మరో మూడు..

5 Kidneys Man : ఒక వ్యక్తిలో ఐదు కిడ్నీలు.. రెండు సొంతానివి.. మరో మూడు..?

5 Kidneys Man

Updated On : August 12, 2021 / 3:24 PM IST

5 kidneys man : ఎవరికైనా కిడ్నీలు ఎన్నుంటాయి అంటే రెండు అని ఎవరైనా చెప్పేస్తారు. చాలా అరుదుగా ఒకే కిడ్నీతో జన్మించినవారు కూడా ఉన్నారు. కానీ తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల వ్యక్తి శరీరంలో ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. ఏంటీ ఐదు కిడ్నీలా? అని ఆశ్చర్యం కలుగుతుంది కదూ.. నిజమే మరి రెండుంటాయి గానీ ఏకంగా ఐదా? అనిపిస్తుంది. కానీ ఈ ఐదు కిడ్నీలు అతనికి పుట్టుకతో రాలేదు. ఈ ఐదు కిడ్నీల్లో రెండు అతని సొంతానివే..మరో మూడు మాత్రం దాతలు ఇచ్చినవే. అలా అతని శరీరంలో ఐదు కిడ్నీలను సెట్ చేసిన ఘనత మాత్రం చెన్నై డాక్టర్లదే కావటం విశేషం. వైద్య చరిత్రలో అరుదైన ఈ ఆపరేషన్ చేశారు చెన్నై డాక్టర్లు.ఈ ఐదు కిడ్నీలు కథా కమామీషు ఏంటంటే..

తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే రెండు కిడ్నీలు పాడైపోయాయి. దీంతో 1994లో రెండుసార్లు రెనల్‌ (మూత్రపిండం)కు సంబంధిచిన సర్జరీలు చేయించుకున్నాడు. ఆ తరువాత 2005లో రెండోసారి కిడ్నీలను మార్చారు. సదరు వ్యక్తికి హైబీపీ ఉండటంతో రెండు సర్జరీలు ఫెయిల్ అయ్యాయ. దీంతో కొరోనరీ ఆర్టరీ వ్యాధి (coronary artery disease) బారినపడ్డాడు. ఈ వ్యాధి ఉన్నవారికి శ్వాస ఆడకపోవడం, గుండెపోటు,గుండెకు తగినంత రక్తాన్ని సరఫరా జరగకపోవటం వంటివి ఉంటాయి. అలాగే త్వరగా అలసిపోవటం,తీవ్ర ఒత్తిడితో భావోద్వేగానికి గురి కావటం వంటి సమస్యలకు గురవుతారు.

అప్పటికే శరీరంలో నాలుగు కిడ్నీలు ఉండడంతో ఐదవది అమర్చడం సంక్లిష్టంగా మారింది. ఈ ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మద్రాస్‌ మెడికల్‌ మిషన్‌ డాక్టర్లకు అతన్ని కాపాడటానికి మరొకటి కనిపించలేదు. దీంతో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సాధారణంగా దాతల కిడ్నీలను.. పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు. కానీ అప్పటికే ఆ పేషంట్‌కు నాలుగు కిడ్నీలు అమర్చి ఉన్నాయి. దీంతో ఐదవ కిడ్నీని ఎక్కడ అమర్చాలనే విషయం డాక్టర్లు తర్జన భర్జనలు పడ్డారు. పైగా ఇంతకు ముందు జరిగిన సర్జరీల వల్ల పేషెంట్‌ నుంచి యాంటీబాడీస్‌ రిలీజ్‌ అయ్యే ప్రమాదం కూడా ఏర్పడొచ్చు. దీంతో అత్యంత జాగ్రత్తగా ఐదవ కిడ్నీని అమర్చాల్సి వచ్చింది. చివరకు రోగి పొత్తికడుపు కుహరం దగ్గర ఐదవ కిడ్నీని అమర్చి.. ఇక్కడే గుండెకు సంబంధించిన రక్తనాళాలకు కనెక్ట్‌ చేశారు. ఏదో యంత్రానికి వైర్లు బిగించినట్లుగా. ప్రపంచంలోనే ఇటువంటి అత్యంత అరుదైన సర్జరీలు జరగడం చాలా చాలా అరుదు.

పాత కిడ్నీలు తీయకుండా కొత్తవి అమర్చటానికి కారణం ఇదే కొత్త కిడ్నీ అమర్చేప్పుడు.. పాత కిడ్నీలను సాధారణంగా తొలగిస్తారు. కానీ ఇతని విషయంలో అలా జరగలేదు. పాత కిడ్నీలు ఉంచేసే కొత్త కిడ్నీలను అమర్చారు. ఎందుకు తొలగించలేదని చాలామందికి చాలా పెద్ద అనుమానం వస్తుంది. దానికి కూడా కారణముందంటున్నారు డాక్టర్లు. ఒకవేళ పాతవి గనుక తొలిగిస్తే.. రక్తస్రావం జరగొచ్చు.పేషెంట్ ఉండే కండిషన్ బట్టి అది ప్రాణాలకే ప్రమాదం. అదే టైంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయ్యి.. కొత్త కిడ్నీ అమర్చడానికి పరిస్థితి అనుకూలం లేకపోవచ్చు.

అందుకే ఆ పాత కిడ్నీలను తొలగించికుండా అలాగే వదిలేశారు. ఇక జులై 10న ఐదవ కిడ్నీ అమర్చే సర్జరీ విజవంతంగా పూర్తి చేశారు చెన్నై డాక్టరలు. అనంతం రోగిని నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి అన్ని విధాలుగా చికిత్సనందించారు.ప్రతి నిమిషం అబ్జర్వుషన్ లోనేఉంచారు.అలా నెల తర్వాత అంటే ఆగస్టు 10న సదరు కిడ్నీల పేషెంట్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని కానీ కొన్ని నెలలపాటు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని డాక్టర్లు తెలిపారు.అలా హైపర్‌టెన్షన్‌(అధిక రక్తపోటు) సమస్య ఉన్న పేషెంట్ కు సంక్లిష్టమైన సర్జరీ ద్వారా ఐదో కిడ్నీని విజయవంతంగా అమర్చారు చెన్నై డాక్టర్లు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన అద్భుతమైన సర్జరీ అని చెబుతున్నారు.