కరోనా హెల్మెట్ : ఈ పోలీస్ ఏం చేస్తున్నారో తెలుసా..వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 04:56 AM IST
కరోనా హెల్మెట్ : ఈ పోలీస్ ఏం చేస్తున్నారో తెలుసా..వీడియో వైరల్

Updated On : March 28, 2020 / 4:56 AM IST

ఏంటీ..ఈ పోలీసు ఇలా ఉన్నాడేంటీ ? కరోనా వైరస్ లాంటి ఉన్న హెల్మెట్ పెట్టుకున్నాడేంటీ ? ఏం చేస్తున్నారు ? అనేగా మీ అనుమానం. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా పోలీసులు, వైద్య సిబ్బంది, ఇతరులు ప్రజలకు పలు సూచనలు, సలహాలిస్తున్నాయి. ఓ పోలీస్ చేస్తున్న వినూత్న ప్రయత్నం విపరీతంగా ఆకట్టుకొంటోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

భారతదేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. సోషల్ డిస్టెన్స్ పాటించాలని..ఇళ్లల్లోనే ఉండిపోవాలని సూచిస్తున్నారు. కానీ చాలా మంది ఏ మాత్రం లెక్క చేయకుండా బయటకు వస్తున్నారు. దీంతో చెన్నైకి చెందిన ఓ పోలీసు వినూత్నంగా కరోనా వైరస్ లా ఉండే..హెల్మెట్ పెట్టుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రూల్స్ అతిక్రమించి..బైక్స్ పై డబుల్స్ వెళుతున్న వారిని ఆపి అవగాహన కల్పిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాపిస్తే..గనుక ఎలాంటి ప్రమాదం వస్తుందోననే దానిపై పూసగుచ్చి వినిపిస్తున్నారు. అంతేగాకుండా..హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కళ్లు, ముక్కు, నోరు, చెవులను టచ్ చేసే అవకాశం లేదని ఆయన వాహనదారులకు వివరంగా చెబుతున్నారు. పోలీసు ఆఫీసర్ చేస్తున్న పనిని సోషల్ మీడియాలో అందరూ మెచ్చుకుంటున్నారు. లాఠీలకు పని చెప్పకుండా..ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు.