Uttar Pradesh : 70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటును తీసుకొచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ

70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటు వెలుగులు లేవు. తన ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించమంటూ పోలీసు అధికారులను ఆమె అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంట వెలుగులు తెప్పించారు.

Uttar Pradesh :  70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటును తీసుకొచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ

Uttar Pradesh

Uttar Pradesh : స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. అయినా ఆ వృద్ధురాలి ఇంట్లో ఇప్పటి వరకూ కరెంటు లేదు. ఇది నిజంగా మనసుని కదిలించే విషయం. విద్యుత్ కనెక్షన్ కోసం ఆమె చేసిన అభ్యర్ధన చూసి ఐపిఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆమె కరెంటు కల నెరవేర్చారు.

intelligent parrot : ఇది మామూలు రామచిలుక కాదు.. తెలంగాణ ఐపీఎస్ అధికారి పోస్ట్ చేసిన రామచిలుక క్యూట్ వీడియో

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 ఏళ్ల నూర్జహాన్‌కు ఇంట్లో ఇప్పటి దాకా కరెంటు వెలుగులు లేవు. విద్యుత్తు కలగానే మిగిలిపోయింది. నూర్జన్ విద్యుత్ కనెక్షన్ కోసం పోలీసులను సంప్రదించింది. ఆమె అభ్యర్ధన విన్న ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆలస్యం చేయకుండా తమ పోలీసు నిధుల నుంచి అవసరమైన ఫ్యాన్, బల్బ్‌ను కొనుగోలు చేసి ఇంటికి కరెంటు వచ్చేలా చేశారు. తన ఇంట్లో విద్యుత్ బల్బు వెలగడంతో ఆ మహిళ ముఖం వెలిగిపోయింది. ఇక అక్కడికి వెళ్లిన పోలీసు అధికారులు ఫ్యాన్ ఆన్ చేసి స్విచ్‌లు ఎలా ఆపరేట్ చేయాలో నూర్జహాన్‌కు వివరించారు. నూర్జహాన్ ఎంతో కృతజ్ఞతతో ఐపీఎస్ ఆఫీసర్‌ను కౌగిలించుకుంది. పోలీసు అధికారులు నూర్జహాన్‌కు మిఠాయిలు పంచారు. మనసుని హత్తుకునే ఈ వీడియోను అనుకృతి శర్మ (Anukriti Sharma, IPS) తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.

kind heart : బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి చలించి పోయిన ఐపీఎస్ ఆఫీసర్.. ఏం చేశారంటే?

‘నూర్జహాన్ ఆంటీ ఇంటికి కరెంటు కనెక్షన్ పొందడం వల్ల ఆమె జీవితంలో వెలుగులు నింపినట్లు అయ్యింది. ఆమె ముఖంలో చిరునవ్వు ఎంతో సంతృప్తినిచ్చింది. అందుకు సహకరించిన SHO జితేంద్ర జీ మరియు మొత్తం టీమ్‌కి ధన్యవాదాలు’ అంటూ శర్మ తన పోస్ట్‌లో షేర్ చేశారు. శ్రీమతి శర్మ 2020 బ్యాచ్ IPS అధికారి, ప్రస్తుతం బులంద్‌షహర్‌లో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘మీ సేవ చూసి మేమంతా గర్విస్తున్నాం.. మీలాంటి అధికారులు మాకు కావాలి’ అని ఒకరు.. ‘దీపం నిరుపేద అమ్మ ఇంటికే కాదు ఆమె జీవితానికి వెలుగునిచ్చింది.. బాగా చేశారు’ అని ఇంకొకరు వరుసగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.