AIADMKకి ఓటు వేస్తే మోడీకి వేసినట్లే – బాబు
అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోడీకి ఓటేసినట్లేనని..స్టాలిన్‌ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని AP CM చంద్రబాబు అన్నారు.

అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోడీకి ఓటేసినట్లేనని..స్టాలిన్‌ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని AP CM చంద్రబాబు అన్నారు.
అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోడీకి ఓటేసినట్లేనని..స్టాలిన్‌ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని AP CM చంద్రబాబు అన్నారు. EVMలను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందని మరోమారు చెప్పారు బాబు. ఈవీఎంలు హ్యాక్, సాఫ్ట్ వేర్ కోడ్ మార్చే ఛాన్స్ ఉందన్నారు. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని, ఈ విషయంలో మరోమారు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామన్నారు. ఏపీలో ఎన్నికల అనంతరం ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు బాబు. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం చెన్నైలో ప్రచారం చేశారు.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్
అంతకంటే ముందు అన్నాడీఎంకే నేతలతో కలిసి బాబు మీడియాతో మాట్లాడారు. జల్లికట్లుపై నిషేధం విధించి మోడీ తమిళ సంస్కృతిని అవమానపరచారని విమర్శించారు. చాలా దేశాలు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేసిన బాబు ఈవీఎంల పనితీరుపై ఈసీ బాధ్యత వహించాలన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాలని తెలిపారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో 4-6 గంటల పాటు ఈవీఎంలు వర్క్ చేయలేదని..అయినా అత్యధిక సంఖ్యలో ప్రజలు ఓటింగ్ పాల్గొన్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పోరాటమని బాబు స్పష్టం చేశారు.
Read Also : టిక్కెట్లపై మోడీ పోటో: ఉద్యోగులపై వేటు