Apple company: ట్రంప్ చెప్పినా తగ్గేదే లే.. ఇండియా వైపే ఆపిల్ మొగ్గు
భారత్ లో ఐఫోన్ల తయారీని చేపట్టొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు సూచించినట్లు ..

Apple iPhone Manufacturing
Apple company: భారత్ లో ఐఫోన్ల తయారీని చేపట్టొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు సూచించిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ సూచనలను సంస్థ ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. టెక్ దిగ్గజం భారత్ లో ఐఫోన్ల తయారీని చేపట్టాలన్న తన ప్రణాళిక నుంచి వెనక్కి తగ్గేది లేదంటుంది.
Also Read: Trump: ‘ట్రంప్‌ని చంపేస్తా’.. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ సంచలన పోస్ట్..
పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్ లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మిత్రమా, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను. కానీ, ఇప్పుడు మీరు భారత్ లో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని వింటున్నాను. మీరు భారత్ లో నిర్మించవద్దు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటి, కాబట్టి అక్కడ అమ్మడం చాలా కష్టం’’ అని టిమ్ కుక్ కు సూచించినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ లో యాపిల్ ఫోన్ల ఉత్పత్తి భారీగా పెంచాలని యోచిస్తున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ట్రంప్ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.. ‘‘భారతదేశంలో ఐఫోన్ల తయారీని చేపట్టేందుకు కంపెనీ ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదు. ఐఫోన్లలో ఎక్కువ భాగం చైనాలో తయారీ జరుగుతూనే ఉంటుంది. అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల ఉత్పత్తిలో ఎక్కువ భాగాన్ని చైనా నుండి భారతదేశానికి మార్చే ప్రణాళిక నుంచి యాపిల్ సంస్థ వెనక్కు తగ్గలేదని తెలుస్తోంది’’. ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోని కుపెర్టినోకు చెందిన గ్లోబల్ టెక్ దిగ్గజం, భారత ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల ద్వారా స్పష్టమైనట్లు డెక్కన్ హెరాల్ట్ తన కథనంలో పేర్కొంది. ఆపిల్ కు అమెరికాలో స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి లేదు. ఎక్కువ భాగం చైనాలోనే తయారవుతాయి. భారతదేశంలోని సౌకర్యాలతో సంవత్సరానికి 40మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఆపిల్ వార్షిక ఉత్పత్తిలో దాదాపు 15శాతం. యూఎస్ లో తయారీ చాలా ఖరీదైంది.
ట్రంప్ వ్యాఖ్యల తరువాత కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆపిల్ ఎగ్జిక్యూటివ్ లతో మాట్లాడినట్లు తెలిసింది. భారతదేశంలో కంపెనీ పెట్టుబడి ప్రణాళికల్లో ఎలాంటి మార్పులేదు. భారత్ లో ఐఫోన్ల తయారీకి ప్రధాన స్థావరంగా మార్చాలని ప్రతిపాదిస్తున్నట్లు వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది.