Asaduddin Owaisi: బీహార్‌లో సీఎం కేసీఆర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు ..

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్ను కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అని స్థానిక మీడియా ప్రశ్నించింది.. ఓవైసీ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi: బీహార్‌లో సీఎం కేసీఆర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు ..

Asaduddin Owaisi

Updated On : March 20, 2023 / 12:44 PM IST

Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్‌కు స్థానిక మీడియా పలు ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా.. కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అన్న ప్రశ్నకు ఓవైసీ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రశంసించారు.

Asaduddin Owaisi vs Sachin Pilot: మోదీ ఆశిస్సులతో దాక్కోలేదు.. సచిన్ పైలట్ వ్యాఖ్యలపై ఓవైసీ ఘాటు విమర్శ

అంతేకాక, కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, తెలంగాణ లాండ్ లాక్డ్ రాష్ట్రం అయినప్పటికీ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి చాలా బాగుందని అన్నారు. పంపు సెట్ల వినియోగంలో ట్యాప్ ర్యాంకులో ఉందని, అంతేకాక మత్స్య సంపదలో దేశంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా తెలంగాణ నిలిచిందంటే దానికి కారణం సీఎం కేసీఆర్ అని ఓవైసీ అన్నారు. అదేవిధంగా నితీష్ కుమార్, మమతా బెనర్జీలనుకూడా ఓవైసీ ప్రశంసించారు.

Asaduddin Owaisi: అయితే నన్ను చంపుతారా?.. కర్ణాటక సీఎం బొమ్మైకి అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న

బీహార్‌లో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకున్న విషయం విధితమే. అయితే నలుగురు ఎమ్మెల్యేలు గత సంవత్సరం ఆర్జేడీలో చేరారు. వారిలో ఒకరికి క్యాబినెట్ బెర్త్ కూడా దక్కింది. ఈ విషయంపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. మేము 2020లో పది అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేశామని, 2025లో 50 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు బరిలో నిలుస్తారని ఓవైసీ అన్నారు.