Assam : 4,444 దీపాలు వెలిగించి..క‌రోనా మృతుల‌కు ఘన నివాళి

అస్సాంలో రెండు గ్రామాలక చెందిన ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి 4,444 మట్టి దీపాలు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలోని రెండు గ్రామాల ప్ర‌జ‌లు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయినవారికి కోసం వినూత్న రీతిలో నివాళులు అర్పించారు.

Assam : 4,444 దీపాలు వెలిగించి..క‌రోనా మృతుల‌కు ఘన నివాళి

Earthen Lamps For Covid 19 Victims

Updated On : June 21, 2021 / 10:32 AM IST

lights 4,444 earthen lamps for COVID-19 victims : భారత దేశ వ్యాప్తంగా కరోనాతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.ఎన్నో కుటుంబాలను కరోనా ఛిద్రం చేసేసింది. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు తీవ్ర వేదన కుమిలిపోతున్నాయి. ఈక్రమంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి 4,444 మట్టి దీపాలు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు అస్సాం వాసులు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలోని రెండు గ్రామాల ప్ర‌జ‌లు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయినవారికి కోసం వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. 4,444 దీపాలు వెలిగించి..క‌రోనా మృతుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

నహర్ కతియా ప‌రిధిలోని నా-ఖోటియా సోనోవాల్‌, మాథవోని అనే రెండు గ్రామాలకు చెందిన ప్ర‌జ‌లు ఈ వినూత్న నివాళులు అర్పించారు. వారి రెండు గ్రామాల్లో రోడ్ల‌కు ఇరువైపులా మట్టి దీపాలు వెలిగించి కరోనాతో చనిపోయినవాకి నివాళులు అర్పించి..వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ రెండు గ్రామాల్లోని 774 కుటుంబాల వారు రాత్రివేళ మొత్తం 4444 మట్టి దీపాలను వెలిగించారు.

ఈ సంద‌ర్భంగా ఈ ప్రాంతానికి చెందిన‌ గాకుల్ బోరా అనే వ్యక్తి మాట్లాడుతూ.. క‌రోనా మ‌హ‌మ్మారి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది పిల్లలు అనాథలుగా మారారు. మా గ్రామంలో కూడా క‌రోనాతో చనిపోయినవారున్నారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం గ్రామంలోని వారంతా కోవిడ్-19 నియమాలను పాటిస్తున్నాం కానీ దురదృష్టవశాత్తు కొంతమందిని కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా..అసోంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,571 క‌రోనా కేసులు న‌మోద‌ుకాగా..40 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 4,178కి చేరుకుంది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 5,141 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య‌ 4,41,184 కు చేరుకుంది.