Bank holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు 12 రోజులే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి నెలలో ఉన్న 28రోజులకు గానూ 12రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.

Bank Holidays
Bank holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం.. జనవరి నెలలోని సెలవుల కంటే ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు తక్కువే. జనవరి31 రోజులకు గానూ మొత్తం 16 రోజుల సెలవులలో 7 వీకెండ్ హాలిడేస్ ఉండగా ఫిబ్రవరిలో 28 రోజులకు గానూ 12 రోజులు ఉండనున్నాయి. గత నెల 51శాతం ఉండగా ఇప్పుడు సెలవు దినాలు 48శాతమే.
ఫిబ్రవరి నెలలో ఉన్న 28రోజులకు గానూ 12రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాంకింగ్ సర్వీసులు, ఏటీఎంలు లాంటివి అంతరాయం లేకుండా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం సెలవులు మూడు కేటగిరీలుగా ఉండనున్నాయి.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రూమెంట్స్ యాక్ట్ హాలీడే, ఇన్‌స్ట్రూమెంట్స్ యాక్ట్ కింద బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ హాలిడే, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ హాలిడేలుగా ఫిబ్రవరిలో 12రోజుల సెలవులు వర్తించనున్నాయి.
బ్యాంకు సెలవు వివరాలు:
* ఫిబ్రవరి 2, సోనమ్ లోచర్ పండుగ సందర్భంగా గ్యాంగ్ టక్ బ్యాంకులన్నింటికీ సెలవు.
* ఫిబ్రవరి 5, శ్రీ పంచమి/ సరస్వతి పూజా/ బసంత్ పంచమి కారణంగా భువనేశ్వర్ బ్యాంకులు, అగర్తలా, కోల్‌కతా బ్యాంకులకు సెలవు.
* ఫిబ్రవరి 15, మొహమ్మద్ హజ్రత్ అలీ/లూయీస్-నగై జన్మదినం సందర్భంగా కాన్పూర్, లక్నో, ఇంఫాల్ బ్యాంకులకు సెలవు.
* ఫిబ్రవరి 16, గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఛండీగఢ్ బ్యాంకులకు సెలవు.
* ఫిబ్రవరి 18, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ముంబై, నాగ్పూర్, బేలాపూర్ బ్యాంకులకు సెలవు.
* ఇవి కాకుండా ఫిబ్రవరి 6, 13, 20, 27తేదీల్లో ఆదివారం రోజుల కారణంగా సెలవులు. వీటితో పాటు ఫిబ్రవరి 12, 26 రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులకు సెలవులు.