Team Thackeray: పక్షపాతం చూపించారంటూ ఎన్నికల సంఘానికి ఉద్థవ్ వర్గం లేఖ
ఈ విషయమై ఉద్ధవ్ థాకరే వర్గం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘వారి మధ్య చాలా గొప్ప కమ్యూనికేషన్ ఉంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ పేజీలో మేము సూచించిన గుర్తులు, పేర్లను కూడా షిండే వర్గానికి అందుబాటులో పెట్టారు. వారికి ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేసేందుకు సమయం పెంచారు. మాపై పక్షపాతం చూపించారు

Bias In Party Names says Team Thackeray
Team Thackeray: రెండుగా విడిపోయిన శివసేన పార్టీకి రెండు కొత్త పేర్లు, రెండు కొత్త గుర్తుల్ని ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే ఎన్నికల సంగం కేటాయించిన పేరు, గుర్తు పట్ల ఉద్ధవ్ థాకరే వర్గం చాలా అసంతృప్తిగా ఉంది. తాము చేసిన ప్రతిపాదనలను పక్కన పెట్టి, తమకు ఏమాత్రం సహకరించలేదని ఆరోపించింది. అదే సమయంలో ప్రత్యర్థి షిండే వర్గానికి మాత్రం.. పేర్లను గుర్తులను ఎంచుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేయడానికి గడువు పెంచడం.. పేరును, చిహ్నాలను ఎంచుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించడం లాంటివి చేశారని థాకరే వర్గం ఆరోపించింది.
ఈ విషయమై ఉద్ధవ్ థాకరే వర్గం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘వారి మధ్య చాలా గొప్ప కమ్యూనికేషన్ ఉంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ పేజీలో మేము సూచించిన గుర్తులు, పేర్లను కూడా షిండే వర్గానికి అందుబాటులో పెట్టారు. వారికి ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేసేందుకు సమయం పెంచారు. మాపై పక్షపాతం చూపించారు. మా సూచనలు వినడం లేదు’’ అని ఉద్ధవ్ వర్గం రాసుకొచ్చింది.
వాస్తవానికి ఉద్ధవ్ వర్గం తమకు పెట్టుకున్న అప్లికేషన్లో పేర్లు, గుర్తులు పొందుపర్చలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. అదే సమయంలో పెద్ద గుర్తుతో, పేరు ప్రతిపాదనతో షిండే వర్గం రాసిన లేఖను బయటికి విడుదల చేసింది ఎన్నికల సంఘం.