బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ : 45మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

  • Published By: chvmurthy ,Published On : October 29, 2019 / 09:39 AM IST
బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ : 45మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

Updated On : October 29, 2019 / 9:39 AM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్‌లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు అవసరం అయితే ఎన్సీపీ-కాంగ్రెస్‌లతో జట్టుకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సంకేతాలు జారీ చేస్తోంది. 

ఇదిలా ఉంటే తర్వాత 5 ఏళ్లు నేనే సీఎం అని దేవేంద్ర ఫడ్నవీస్ గట్టిగా చెపుతున్నారు. శివసేన ఐదేళ్ల పాటు సీఎం పదవి తమకే దక్కాలని ఆశిస్తోంది. కోరుకున్నవన్నీ జరగవు. సీఎం సీటుపై మేమెప్పుడూ 50:50 ఫార్ములా పాటిస్తామని వారికి హామీ ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇలా రెండు పార్టీల మధ్య అంతర్యుధ్దం జరుగుతోంది. 

మరో వైపు శివసేనపై  గెలిచిన 56 మంది ఎమ్మెల్యేలలో 45 మంది ఎమ్మెల్యేలు సీఎం ఫడ్నవీస్‌తో టచ్లో ఉన్నారని బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిలో కొందరు ఉద్ధవ్ థాక్రేను ఒప్పించి.. ఫడ్నవీస్‌ను మళ్లీ సీఎంను చేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వేరే ఆప్షన్ ఉన్నట్లు తాను భావించడం లేదని బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే చెప్పారు.