9మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ…మెదక్ బరిలో రఘునందన్ రావు

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2019 / 03:34 PM IST
9మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ…మెదక్ బరిలో రఘునందన్ రావు

Updated On : March 24, 2019 / 3:34 PM IST

లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే తొమ్మిదిమంది అభ్యర్థులతో ఆదివారం(మార్చి-24,2019)బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది.చత్తీస్ ఘడ్ లో 6,మహారాష్ట్రలో 1,మేఘాలయ 1,తెలంగాణ 1 అభ్యర్థితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో తెలంగాణలోని మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ సీనియర్‌ లీడర్ రఘునందన్‌ రావును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.  గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌ పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 

బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌)ని ప్రకటించగా.. రెండో జాబితాలో సోయం బాపూరావు (ఆదిలాబాద్‌), ఎస్‌.కుమార్‌ (పెద్దపల్లి), బాణాల లక్ష్మారెడ్డి (జహీరాబాద్‌), డా.భగవంత్‌రావు (హైదరాబాద్‌), జనార్దన్‌రెడ్డి (చేవెళ్ల), వసుదేవ్‌ రావు (ఖమ్మం)లకు చోటు దక్కింది.ఇప్పుడు మెదక్‌ స్థానానికి రఘునందన్‌ను ఆ పార్టీ ఎంపిక చేసింది.