Kamal Haasan – Shruti Haasan: కమల్‌హాసన్ కూతురు శ్రుతిపై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలంటోన్న బీజేపీ
మక్కల్ నీధి మయ్యమ్ (ఎమ్ఎన్ఎమ్) చీఫ్ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ పై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని బీజేపీ కోరుతుంది. కొయంబత్తూరు సౌత్‌లో ..

Kamal Hasan Daughter Shriuthi
Kamal Haasan – Shruti Haasan: మక్కల్ నీధి మయ్యమ్ (ఎమ్ఎన్ఎమ్) చీఫ్ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ పై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని బీజేపీ కోరుతుంది. కొయంబత్తూరు సౌత్‌లో ఉన్న పోలింగ్ బూత్‌లోకి అనుమతి లేకుండానే ఎంటర్ అయిన శ్రుతిపై కేసు నమోదు చేయాలని అడుగుతున్నారు.
కూతుళ్లు శ్రుతి, అక్షరలతో కలిసి ఓటు వేసేందుకు కమల్ వచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన మంగళవారం పోలింగ్ బూత్ లలో తిరిగి ఓటింగ్ విధానాన్ని సమీక్షించారు. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ డబ్బులు పంచుతామనే ఆశ చూపిస్తుందని అన్నారు.
బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నందకుమార్ తో కలిసి బీజేపీ నేషనల్ ఉమెన్ వింగ్ లీడర్ వనతి శ్రీనివాసన్ లు జిల్లా ఎన్నికల అధికారి.. శ్రుతిహాసన్ పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. పోలింగ్ బూత్ లను విజిట్ చేయడాన్ని తప్పుబట్టారు. బూత్ ఏజెంట్లు మినహాయించి మరెవ్వరూ పోలింగ్ బూత్ లలోకి ఎంటర్ అవకూడదనే నియమాన్ని గుర్తు చేస్తున్నారు.