నోటి దురుసు : ప్రియాంకపై నోరు పారేసుకుంటున్న బీజేపీ

ఢిల్లీ : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి బీజేపీ నేతలు ఆమెపై పలు అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా పురుషులపై కంటే మహిళలపైనే నేతలు.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి వ్యక్తిగతంగా.. మహిళ అనే కారణంతోనే ప్రియాంకా గాంధీని టార్గెట్ చేసినట్లు ఉన్నాయి ఈ వ్యాఖ్యలు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
కాంగ్రెస్ యూపీ ప్రచార సారధి ప్రియాంకా గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు పలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాజస్థాన్ నేత జ్ఞాన్‌దేవ్ అహుజా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రావణుడు అనీ ప్రియాంకా గాంధీని శూర్పనఖలతో పోల్చి వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ వినయ్ కతియార్ వ్యాఖ్యలు
ప్రియాంక కంటే అందమైన మహిళలు చాలా మంది ఉన్నారని…ఆమె కంటే యాక్టర్లు, ఆర్టిస్టులు అందంగా ఉంటారని నోటికొచ్చినట్టు మాట్లాడారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ వినయ్ కతియార్.
కేంద్ర మంత్రి మాన్ సుఖ్ మాండవీయ వ్యాఖ్యలు
ఇందిరాగాంధీ లాంటి ముక్కు ఉన్నంత మాత్రాన ప్రియాంకా గాంధీ అధికారంలోకి రాలేరని..అలా జరగుతుందని వారు భావిస్తే..చైనాలో ప్రతీ ఇంటి నుంచి ఓ అధ్యక్షుడు వస్తాడని వ్యంగ్యంగాస్త్రాలు సంధించారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష
బీజేపీ నేత హరీశ్ ద్వివేదీ
ఢిల్లీలో టాప్-జీన్స్ వేసుకుని తిరిగే ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రాగానే శారీ కట్టుకుని, నుదుట సింధూరం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా బీజేపీ నేతలు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ ను ఎదుర్కోవటం మానివేసి..తరచు ప్రియాంకా గాంధీపై వ్యక్తగతంగా వ్యాఖ్యలు చేయటం వివాదానికి దారి తీస్తోంది.
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి
ప్రియాంక ‘బైపోలార్ డిజార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి ప్రజలకు కూడా వ్యాపించేలా కాంగ్రెస్ యత్నిస్తోందని, బైపోలార్ డిజార్డర్‌తో ప్రియాంక ప్రజా జీవితంలో పనిచేయలేదని వ్యాఖ్యానించారు.
బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా
ప్రియాంక అందమైన ముఖాన్ని చూసి ఎవరూ ఓట్లు వేయరనీ.. ‘‘ఆమె అందంగా మాత్రమే ఉంటారు..రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ప్రియాంకా అన్న (రాహుల్ గాంధీ) పెళ్లి చేసుకోలేదు.. అందుకే సోదరి (ప్రియాంక గాంధీ) రాజకీయాల్లోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.
సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డు చీఫ్ వసీం రిజ్వీ
ప్రియాంకగాంధీ చాలా అందగత్తె అంటు సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డు చీఫ్ వసీం రిజ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె అందానికి తాను తీసిన రామజన్మభూమి సినిమాలో అవకాశం ఇచ్చేవాడి ఆమె ఇంతకుముందే వచ్చి ఉంటే అంటు వ్యాఖ్యానించారు. బుధవారం (మార్చి 28)న ఫైజాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తన సినిమాలో జాఫర్‌ఖాన్ భార్యగా ముస్లిం మహిళ పాత్రను ప్రియాంకకు ఇచ్చి ఉండేవాడిని అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ రిజ్వీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై సెక్షన్ 354, 309 ప్రకారం కేసు నమోదు చేశారు.
కాగా మత చాంధస వాదులుగా పేరొందిన బీజేపీ నేతలకు స్త్రీపట్ల ఉండే చులకన భావం వారి వ్యాఖ్యల్లో కనిపిస్తుంటుంది. గతంలో కూడా బీజేపీ నేతలు మహిళలపై జరగిన హింసలపై మాట్లాడుతు..వారి డ్రస్ కోడ్ లపైన..రాత్రి పూట మహిళలు బైట తిరుగుతుండటం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయనీ ఇలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
Read Also : లైన్ క్లియర్: థియేటర్‌లలో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్.. ఫస్ట్ టాక్ ఇదే!