Uttar Pradesh : పేపర్ చదవలేకపోయాడు..పెళ్లి వద్దన్న వధువు

న్యూస్ పేపర్ చదవాలని వరుడిని వధువు కోరగా..అతను చదవలేకపోయాడు. దీంతో ఈ పెళ్లి వద్దని వధువు ఖరాఖండిగా చెప్పేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Uttar Pradesh : పేపర్ చదవలేకపోయాడు..పెళ్లి వద్దన్న వధువు

Up

Updated On : June 24, 2021 / 10:54 PM IST

Bride Calls Off Wedding : నిజ జీవితంలో గుర్తుండిపోయేలా పెళ్లిళ్లులు జరుపుకుంటుంటారు. అయితే..కొన్ని విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. చిన్ని చిన్న కారణాలతో పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక కాసేపట్లో వివాహం జరుగుతుందనగా..వరుడి కుటుంబసభ్యులు కోర్కెలను వెలువరిస్తున్నారు. దీంతో వధువులు ఆ పెళ్లిళ్లు వద్దని చెబుతున్నారు. తాజాగా..న్యూస్ పేపర్ చదవాలని వరుడిని వధువు కోరగా..అతను చదవలేకపోయాడు. దీంతో ఈ పెళ్లి వద్దని వధువు ఖరాఖండిగా చెప్పేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఔరేయా నగరంలో శివమ్ వివాహం ఓ యువతితో నిశ్చయమైంది. వరుడు చక్కగా ఉండడంతో వధువు తండ్రి అర్జున్ సింగ్ పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నాడు. పెళ్లికి తేదీని ఖరారు చేశారు. ఇరు కుటుంబసభ్యులు వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేయనున్నాడు. అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదటి నుంచి వరుడిపై వధువుకు ఏదో అనుమానం కలిగింది.

పెళ్లి వేడుకల్లో కళ్లద్దాలు ధరించడం ఈ అనుమానం మరింత ఎక్కువైంది. పెళ్లి పీఠలపై కూర్చొన్న వరుడి చేతికి ఓ పేపర్ ఇచ్చింది. చదవాలని సూచించింది. ఏం చేయాలో తెలియక అటూ ఇటూ చూపులు చూశాడు శివమ్. అతడికి చూపు సరిగ్గా లేదని నిర్ధారించుకున్న అనంతరం పెళ్లి వద్దని చెప్పేసింది. కుటుంబసభ్యులు పెళ్లిని ఆపేశారు. కట్నం కింద ఇచ్చిన డబ్బులు, ఇతరత్రా వెనక్కి ఇచ్చేయాలని వధువు కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. దీనికి వరుడు తరపు వారు నిరాకరించడంతో ఔరేయా కొట్వాలి పీఎస్ లో కేసు నమోదు చేశారు.