రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్రంలో లాక్‌డౌన్ ఎలా?

ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో లాక్‌డౌన్ ను ఏప్రిల్ 30వరకూ పొడిగించేశాయి. వీటితో పాటుగా రంగంలోకి దిగిన కేంద్ర 21రోజుల లాక్‌డౌన్‌కు మరో రెండు వారాలతో పాటు ఇంకో 2రోజులు జోడించింది. మే 3వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ఏప్రిల్ 14న ప్రకటించారు. కేంద్రం.. రాష్ట్రాల కంటే ఎక్కువ రోజులకు పొడిగించడం వెనక కారణమేంటి?
రాజ్యాంగం ప్రకారం.. లాండ్ అండ్ ఆర్డర్, ప్రజారోగ్యం అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండు రకాలుగా మాత్రమే చర్యలు తీసుకోలేదు. మహమ్మారి జబ్బుల చట్టం 1897ని బట్టి చాలా రాష్ట్రాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. తాత్కాలిక నిబంధనలతో ప్రజావసరాలకు ఇబ్బంది కలగకుండా లాక్‌డౌన్‌ను నిర్వహిస్తున్నాయి. పలు రాష్ట్రాల నియమాలను కాపీ చేసిన కేంద్రం మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన పనిచేస్తున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్డీఎమ్మే) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్6(2)(i)ప్రకారం..లాక్ డౌన్ ప్రకటించింది.
సెక్షన్ 10(2)(l) ప్రకారం.. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ.. 21రోజుల లాక్ డౌన్ ఆదేశాలిచ్చింది. కేంద్రంతో చర్చించి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయా.. లేదా రాష్ట్రాలు కేంద్రం నిర్ణయం ధిక్కరించి లాక్‌డౌన్ విధించాయా? నిజానికి ఇది వాస్తవం కాదు. ఈ ఆర్డర్ పాస్ చేయడంలో ముమ్మాటికి అధికారం కేంద్రానికే ఉంటుంది.
ఆర్టిక్ 254 ప్రకారం.. రాజ్యంగం ఏం చెబుతుందంటే, పార్లమెంట్, రాష్ట్రాలు అమలుపరిచిన చట్టాల్లో ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే కేంద్రం అందులో ఇన్వాల్వ్ అవ్వొచ్చు. రాష్ట్రపతికి కూడా రాష్ట్రాలను శాసించే ఎమర్జెన్సీ పవర్ ఉంటుంది. రాష్ట్రాలు కావాలంటే స్వతంత్ర్యంగా లాక్‌డౌన్ ప్రకటించుకోవచ్చు. కానీ, కేంద్రం విధించిన లాక్‌డౌన్ ఉల్లంఘించే అధికారం రాష్ట్రాలకు లేదు.