చంద్రబాబుకి ప్రధాని అయ్యే అర్హత ఉంది: పవార్

లోక్‌సభ ఎన్నికల వేళ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకుని వచ్చారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. యూపీఏ, ఎన్‌డీఏ యేతర పక్షాల బలంతోనే ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు అర్హత గలవారని శరద్ పవార్ అన్నారు.
రాహుల్ గాంధీ కంటే ఎన్‌డీయేతర పక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే వీరు ముగ్గురిలో ఒకరిని ఎంచుకోవడమే ఉత్తమమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్‌డీఏని కచ్చితంగా అధికారంకు దూరం చేస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అలాగే ప్రధానిగా తనకు ఉన్న అవకాశాలపై ఆయనను ప్రశ్నించగా.. తాను కింగ్ మేకర్‌గా ఉంటానని అన్నారు.
అలాగే ఎన్నికల తర్వాత ఎన్‌డీఏలోని కొన్ని పార్టీలతో కూటమి ఏర్పాటు చేయనున్నట్లు పవార్ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదని ఇప్పటికే చంద్రబాబు, మమత చెప్పిన సంగతి తెలిసిందే. మాయావతి కూడా దీనిపై స్పష్టమైన సంకేతాలను ఇప్పటికే ఇచ్చారు.