అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో బలగాలను మోహరిస్తోన్న చైనా …భారత ఆర్మీ హై అలర్ట్

గతనెల చివర్లో దక్షిణ పాంగాంగ్ సరస్సు సమీపంలోని ఎత్తైన ప్రాంతాల్లో చొరబాటుకు యత్నించి భారత ఆర్మీ చేతిలో భంగపడిన చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి ప్రయత్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వైపున చైనా తన బలగాలను మోహరిస్తోంది. అక్కడి లోయ ప్రాంతాల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కదలికలను భారత నిఘా వ్యవస్థలు గుర్తించాయి. ఆర్మీని అలెర్ట్ చేయడంతో ఆ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను పటిష్ఠం చేసింది.
భారత్, చైనా సరిహద్దులోని లఢక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్నిచోట్ల పీఎల్ఏ కదలికలపై పటిష్ఠమైన నిఘా ఉంచినట్లు భారత రక్షణ వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు వెనుక వైపున లోతైన అసఫిలా, ట్యూటింగ్ యాక్సిస్, ఫిష్ టెయిల్ 2 ప్రాంతాల్లో ఎల్ఏసీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చైనా సైన్యం కదలికలను గమనించినట్లు చెప్పాయి. భారత్, చైనా సరిహద్దులోని లఢక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్నిచోట్ల పీఎల్ఏ కదలికలపై పటిష్ఠమైన నిఘా ఉంచినట్లు భారత రక్షణ వర్గాలు తెలిపాయి.