CM Aravind Kejriwal : ప్రజలు మాస్క్‌లు ధరించి కరోనా వ్యాపించకుండా నిరోధించాలి : సీఎం కేజ్రీవాల్

హోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 23న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో 99శాతం మంది ప్రజలు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారని తెలిపారు.

CM Aravind Kejriwal : ప్రజలు మాస్క్‌లు ధరించి కరోనా వ్యాపించకుండా నిరోధించాలి : సీఎం కేజ్రీవాల్

Aravind Kejriwal

Updated On : December 20, 2021 / 3:49 PM IST

CM Kejriwal responds to covid situation : ప్రజలంతా మాస్క్‌లు ధరించి బయటకు రావాలని, కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలో కోవిడ్ పరిస్థితులపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. కొన్ని రోజులుగా ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రస్తుతం నమోదు అవుతున్న అన్ని పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతామని తెలిపారు.

హోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 23న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో 99 శాతం మంది ప్రజలు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారని తెలిపారు. 70 శాతం మంది రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారని వెల్లడించారు. రెండు డోస్‌లు తీసుకున్న వారికి బూస్టర్ డోస్‌లను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు.

CM Kejriwal : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..ఉచిత రేషన్ పథకం 6 నెలలపాటు పొడిగింపు

బూస్టర్ డోస్ ఇవ్వడానికి కావాల్సిన తగిన మౌలిక సదుపాయాలు ఢిల్లీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని, అయితే అది వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఢిల్లీలో తగిన ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.