నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేశారు.

నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్

sonia gandhi

Rajya Sabha Candidates : కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం బుధవారం విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ బరిలోకి దిగనున్నారు. బీహార్ నుంచి అఖిలేశ్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోరేలు పోటీ చేయనున్నారు.

Also Read : Adala Prabhakara Reddy: నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో అభ్యర్థుల ఎంపికపై సోమవారం కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులపై వీరు చర్చించారు. సమావేశంలో తీకున్న నిర్ణయాల మేరకు తాజాగా కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు ఇదిలాఉంటే.. మధ్యప్రదేశ్ లో ఒకటి, తెలంగాణలో రెండు, కర్ణాటకలో మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

Also Read : మరో ఛాన్స్ లేనట్లేనా? ఆ ఇద్దరు మహిళా ఎంపీల రాజకీయ భవిష్యత్‌‌పై సందేహాలు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వయస్సు, ఆరోగ్యంరిత్యా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు వెళ్లనున్నారు. బుధవారం రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్యసభకు సోనియా నామినేషన్ దాఖలు చేశారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న యూపీలోని రాయ్ బరేలీ స్థానం నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. రాయ్ బరేలీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటింది. సోనియా గాంధీ ఇక్కడ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఉన్నారు. సోనియా ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావడంతో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ స్థానం నుంచి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.