ముంబై నార్త్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ
కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ కు లోక్ సభ టిక్కెట్ కన్ఫార్మ్ అయింది.

కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ కు లోక్ సభ టిక్కెట్ కన్ఫార్మ్ అయింది.
కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ కు లోక్ సభ టిక్కెట్ కన్ఫార్మ్ అయింది. ఏప్రిల్ లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరపున బరిలోకి దిగనుంది. ఈ మేరకు శుక్రవారం(మార్చి-29,2019) పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టితో ఆమె ఈ ఎన్నికల్లో తలపడనుంది.2014లో ముంబై నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గోపాల్ శెట్టి విజయం సాధించారు.మరోసారి ముంబై నార్త్ నుంచి ఆయననే బీజేపీ రంగంలోకి దించింది.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు
రెండు రోజుల క్రితం ఊర్మిళ..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాహుల్ నాయకత్వం నచ్చే పార్టీలోకి చేరానని, దేశ సేవ చేసేందుకే క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చానని ఆమె చెప్పారు.నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నేతలు వ్యక్తిత్వపరంగా తనకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.మోడీ సర్కార్ పై కూడా ఊర్మిళ విమర్శలు గుప్పించారు.దేశంలో అసహనం పెరిగిపోతుందన్నారు.రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే