ఇది కూడా ప్రచారమేనా: రాహుల్ గాంధీ గల్లీ క్రికెట్

  • Published By: chvmurthy ,Published On : October 19, 2019 / 12:09 PM IST
ఇది కూడా ప్రచారమేనా: రాహుల్ గాంధీ గల్లీ క్రికెట్

Updated On : October 19, 2019 / 12:09 PM IST

హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీజీ బీజీగా గడిపి… బీజేపీ మీద  తీవ్ర విమర్శలు చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ కాస్త టైం చిక్కగానే బ్యాట్ పుచ్చుకుని క్రికెట్ ఆడారు. ఆయన క్రికెట్ ఆడింది ఢిల్లీలోని గల్లీలోనో, ఏ పెద్ద స్టేడియంలోనో కాదు… ఒక చిన్నగ్రౌండ్ లో స్ధానిక యువతతో కలిసి క్రికెట్ ఆడారు.  

వివరాల్లోకి వెళితే 2019,అక్టోబరు21న జరిగే హర్యానా శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గోనేందుకు రాహుల్ గాంధీ అక్టోబర్ 18న మహేంద్రఘడ్ లో జరిగిన సభలో పాల్గోన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు  హెలికాప్టర్ లో పయనమయ్యారు

ఇంతలో వాతావరణం అనుకూలించక పోవటంతో ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ను రేవారిలోని కేఎల్పీ కాలేజీ గ్రౌండ్ లో అత్యవసరంగా దింపారు. గ్రౌండ్ లో దిగిన రాహుల్ గాంధీ అక్కడ క్రికెట్ ఆడుతున్న యువకుల వద్దకు వెళ్లి వారితో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.