కరోనా తగ్గుముఖం, తెలంగాణలో 1,486, ఇండియాలో 46 వేల 791 కేసులు

  • Published By: madhu ,Published On : October 20, 2020 / 11:06 AM IST
కరోనా తగ్గుముఖం, తెలంగాణలో 1,486, ఇండియాలో 46 వేల 791 కేసులు

Updated On : October 20, 2020 / 11:27 AM IST

corona cases declined : రతదేశంలో కరోనా తగ్గుముఖం పడుతోందా ? అంటే..అవుననే సమాధానం వస్తోంది. తొలుత 70 నుంచి 80 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కానీ..ప్రస్తుతం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది.



కేసులు తక్కువగానే నమోదువుతున్నాయి. గత 24 గంటల్లో 46 వేల 791 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 587 మంది చనిపోయారని తెలిపింది.
https://10tv.in/russia-approves-nd-coronavirus-vaccine-after-early-trials/
7 లక్షల 48 వేల 538 యాక్టివ్ కేసులున్నాయి. 67 లక్షల 33 వేల 328 మంది రికవరీ అయ్యారని పేర్కొంది. 2020, అక్టోబర్ 19వ తేదీ 10,32,795 శాంపిల్స్ పరీక్షించినట్లు, మొత్తం టెస్టుల సంఖ్య 9,61,16,771 కు చేరుకుందని తెలిపింది.



ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,486 కేసులు నమోదయ్యాయని, 1,891 మంది కోలుకోగా.. ఏడుగురు మృతి చెందారని ప్రభుత్వం విడుద చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం కేసులు 2, 24, 545 ఉండగా..2, 02, 577 రికవరీ చెందారని తెలిపింది. మొత్తం మరణాల సంఖ్య 1,282 ఉండగా, 20 వేల 686 యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : –
ఆదిలాబాద్ 21. భద్రాద్రి కొత్తగూడెం 96. జీహెచ్ఎంసీ 235. జగిత్యాల 29. జనగామ 17. జయశంకర్ భూపాలపల్లి 22. జోగులాంబ గద్వాల 20. కామారెడ్డి 38. కరీంనగర్ 69. ఖమ్మం 89. కొమరం భీం ఆసిఫాబాద్ 9. మహబూబ్ నగర్ 30.



మహబూబాబాద్ 28. మంచిర్యాల 24. మెదక్ 22. మేడ్చల్ మల్కాజ్ గిరి 102. ములుగు 23. నాగర్ కర్నూలు 31. నల్గొండ 82. నారాయణపేట 8. నిర్మల్ 14. నిజామాబాద్ 28. పెద్దపల్లి 35. రాజన్న సిరిసిల్ల 35. రంగారెడ్డి 112. సంగారెడ్డి 21. సిద్దిపేట 42. సూర్యాపేట 44. వికారాబాద్ 18. వనపర్తి 32. వరంగల్ రూరల్ 25. వరంగల్ అర్బన్ 54. యాదాద్రి భువనగిరి 29. మొత్తం : 948