భారత్‌లో 110 కి పెరిగిన కరోనా కేసులు, ఆ రాష్ట్రంలో అత్యధికంగా 32 కేసులు నమోదు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 02:10 AM IST
భారత్‌లో 110 కి పెరిగిన కరోనా కేసులు, ఆ రాష్ట్రంలో అత్యధికంగా 32 కేసులు నమోదు

Updated On : March 16, 2020 / 2:10 AM IST

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6వేల 515మంది చనిపోయారు. అలాగే కరోనా బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. లక్ష 69వేల 415 మంది కరోనా బారిన పడ్డారు. 5వేల 921మందికి సీరియస్ గా ఉంది. చైనాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపుతోంది. నిన్న ఒక్క రోజే ఇటలీ, స్పెయిన్ లో కరోనా కట్టలు తెచ్చుకుంది. 4వేల 500 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 2019 డిసెంబర్ లో చైనాలో వుహాన్ లో కరోనా వెలుగు చూసింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు.

See Also | రాకాసి కరోనా, 157 దేశాలకు వ్యాపించిన వైరస్, 6వేల 515మంది మృతి

ఉత్తరాఖండ్ లో తొలి పాజిటివ్ కేసు:
ఇక భారత్ లోనూ కరోనా కల్లోలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. మన దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 110 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు చనిపోయారు. వారంతా వృద్ధులే. బయటి దేశాల నుంచి వచ్చినవారే. కాగా, ఉత్తరాఖండ్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే వివరాలు తెలిపింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం అత్యధికంగా మహారాష్ట్రలో 32 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 22, దేశ రాజధాని ఢిల్లీలో 7 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, కరోనా ప్రాణాంతకం కాదని భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. అలాగని అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

* భారత్ లో 110 కి చేరిన కరోనా కేసులు
* కరోనా కేసుల వివరాలు పోర్టల్ లో వెల్లడించిన కేంద్ర వైద్యారోగ్య శాఖ
* ఉత్తరాఖండ్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు
* మహారాష్ట్రలో 32, కేరళలో 22, యూపీలో 11, ఢిల్లీలో 7 కేసులు నమోదు
* కర్నాటకలో 6, తెలంగాణలో 3, లడఖ్ లో 3, జమ్ముకశ్మీర్ లో 2 కేసులు నమోదు
* రాజస్తాన్ లో 2.. పంజాబ్, ఏపీ, తమిళనాడులో ఒక్కో కేసు నమోదు
* కరోనాతో భారత్ లో ఇద్దరు మృతి

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 110 కేసులు నమోదయ్యాయి. కరోనాను డబ్ల్యూహెచ్ వో మహమ్మారిగా గుర్తించింది. మన దేశం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అలాగే థియేటర్లు, పబ్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పార్లమెంట్ సముదాయంలోకి సందర్శకులకు ఎంట్రీ నిషేధించారు. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఆంక్షలు విధించారు.

See Also | ప్యాకప్ : టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్..షూటింగ్‌లు బంద్