ఇండియాలో కరోనా..పెరుగుతున్న మృతుల సంఖ్య : మహారాష్ట్రలో మరొకరి మృతి ?

భారతదేశంలో కరోనా చాపకిందనీరులా విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలకు పాకుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు..ఇక్కడ కరోనా వైరస్ వ్యాధితో చనిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు చనిపోగా..మహారాష్ట్రలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం.
బుల్దానా జిల్లా ఆస్పత్రిలో 71 సంవత్సరాల వృద్ధుడు చనిపోయాడు. ఇతను సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇతను…బీపీ, డయాబెటిస్ వ్యాధులతో ప్రైవేటు ఆసుపత్రి నుంచి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. 2020, మార్చి 14వ తేదీ శనివారం ఇతను కన్నుమూశాడు. ఇతనికి సంబంధించిన రిపోర్టులను పూణే ల్యాబ్‌కు పంపించారు వైద్యాధికారులు. కరోనా వ్యాధితో చనిపోయాడా ? లేక ఇతర వ్యాధులతో చనిపోయాడా అనేది రిపోర్టు అందితేగాని తెలియదు. ఒకవేళ కరోనా వ్యాధితో చనిపోయాడని తేలితే..దేశంలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరుకుంటుంది.
మహారాష్ట్రలో 20 కేసులు పాజిటివ్ కేసులు నమోదు కావడం భయం కలిగిస్తోంది. పాఠశాలలు, మాల్స్, సినిమా హాల్స్, కళాశాలలు, పబ్బులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాధితో చనిపోతున్న వారిలో ఎక్కువగా వృద్ధులు ఉంటున్నారు. వీరిలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండడం, హైపర్ టెన్షన్, డయాబెటిస్, హార్ట్‌కు సంబంధించిన అనారోగ్యం ఉంటే..వారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో చనిపోయిన వృద్ధుడు కరోనా…వ్యాధితో చనిపోయాడా ? లేక అతనికున్న వ్యాధులతో మరణించాడా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే.
Read More : కరోనా భయం : స్థానిక, మేయర్ ఎన్నికల వాయిదా