కరోనా పిడికిలిలో ఇండియా : 733 కేసులు..20 మంది మృతి

  • Published By: madhu ,Published On : March 27, 2020 / 04:38 AM IST
కరోనా పిడికిలిలో ఇండియా : 733 కేసులు..20 మంది మృతి

Updated On : March 27, 2020 / 4:38 AM IST

ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి భారతదేశాన్ని వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించినా కేసుల నమోదు మాత్రం ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

2020, మార్చి 27వ తేదీ శుక్రవారానికి భారతదేశంలో 733 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 20 మంది చనిపోయారు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లలో ఒక్కొక్కరు చనిపోయారు. కర్నాటక, రాజస్థాన్ లలో ఇద్దరు చొప్పున కన్నుమూశారు. చెందారు. 

కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు కొంతవరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. లాక్ డౌన్ రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, ఇళ్లల్లో ఉండాలని వెల్లడించింది.

కానీ కరోనా కేసులు మాత్రం తక్కువ కావడం లేదు. ఇప్పటి వరకు కేసులు నమోదు కాని రాష్ట్రాల్లో వైరస్ లక్షణాలు కనిపిస్తుండడం తీవ్ర  ఆందోళన వ్యక్తమౌతోంది. అయితే..వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నా..పెరుగుదల రేటు నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది. 

కేరళ 137, ఢిల్లీలో 36, మహారాష్ట్ర లో 125, ఉత్తర్ ప్రదేశ్ 42, రాజస్థాన్ 50, తెలంగాణ 45, లడఖ్ 14, కర్నాటక 55, ఏపీ 11, పశ్చిమ బెంగాల్ 10, ఇతర రాష్ట్రాల్లో 10 లోపు కేసులు నమోదయ్యాయి. 

Also Read | గృహిణుల కోసం ఇంటి ముందుకే కూరగాయలు