Coronavirus in Bengaluru : రూటు మార్చిన కరోనా..చిన్న పిల్లలపై కరోనా పంజా, జాగ్రత్త సుమా

బెంగళూరులో చిన్నపిల్లలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు పెద్దవారిలోనే ఎక్కువగా బయటపడ్డ కరోనా.. సెకండ్ వేవ్‌లో రూటు మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Coronavirus in Bengaluru : రూటు మార్చిన కరోనా..చిన్న పిల్లలపై కరోనా పంజా, జాగ్రత్త సుమా

Coronavirus In Bengaluru

Children COVID : బెంగళూరులో చిన్నపిల్లలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు పెద్దవారిలోనే ఎక్కువగా బయటపడ్డ కరోనా.. సెకండ్ వేవ్‌లో రూటు మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు పెద్ద వయసు వారితోపాటు చిన్నారుల్లో కూడా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 1 నుంచి బెంగళూరులో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 472 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. అందులో 244 మంది బాలురు, 228 మంది బాలికలు ఉన్నారు. మార్చి మొదటి వారంలో చిన్న పిల్లల్లో రోజుకు 10 కేసులు వరకు నమోదవగా.. రెండు రోజులుగా అవి విపరీతంగా పెరిగిపోయాయి. మొన్న ఒక్క రోజే 46మంది చిన్న పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు.

గతంలో మాదిరిగా కాకుండా సిటీలో పిల్లలు ఇప్పుడు బహిరంగంగా బయట తిరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. లాక్‌డైన్‌ ముగిసి పరిస్థితులు సద్దుమణగడంతో కొన్ని తరగతుల వారికి స్కూల్స్‌ తిరిగి తెరిచారు. దీంతో చాలా మంది స్కూలుకు వెళ్లడంతో పాటుగా ఇంటి పక్కనుండే చిన్నారులతో ఆటలాడుడూ వైరస్‌ను స్ప్రెడ్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. పెద్ద వారు ఉద్యోగాలకు వెళ్లడం, బహిరంగ ప్రదేశాల్లో మార్గదర్శకాలు పాటించకుండా తిరుగుతుండటంతో వారి నుంచి చిన్నారులకు వైరస్ సోకుతోందనే వాదన కూడా ఉంది.

మరోవైపు…మహారాష్ట్రలో కరోనా కరళ నృత్యం చేస్తోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 40 వేల 414 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. 17 వేల 874 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. అలాగే ముంబైలో గడిచిన 24 గంటల్లో 6 వేల 923 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Read More : మదనపల్లి కూతుళ్ల హత్య కేసు.. మెంటల్ ఆసుపత్రి నుంచి భార్యాభర్త డిశ్చార్జ్