మళ్లీ ఆ కష్టం తప్పదా? మళ్లీ సొంత ఊళ్లకు వెళ్లిపోవాల్సిందేనా?!

మళ్లీ ఆ కష్టం తప్పదా? మళ్లీ సొంత ఊళ్లకు వెళ్లిపోవాల్సిందేనా?!

Covid 19 Demand Lockdown Maharashtra Mumbai Rise (1)

Updated On : April 3, 2021 / 3:51 PM IST

covid-19 demand lockdown maharashtra Mumbai rise : గత సంవత్సరం ఇదే రోజుల్లో వలస కార్మికుల కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా మహమ్మారి. భారత్ లో కరోనా మహమ్మారి ఏడాది దాటిపోయినా దాని ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు సరికదా సెకండ్ వేవ్ కూడా కొనసాగిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తోందీ మహమ్మారి. ఈక్రమంలో కరోనా తగ్గి మరోసారి పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తిరగి వారి వారి పనుల్లో నిమగ్నమవుతున్నారు కష్టజీవులు.కానీ సెకండ్ వేవ్ కొనసాగిస్తున్న కరోనాతో మరోసారి లాక్ డౌన్ తప్పదా? అనే పరిస్థితులు నెలకొన్న ఈ క్రమంలో పేదింటి మహిళలు హడలిపోతున్నారు.

9

మరోసారి ఆ కష్టాలు తప్పవా? మళ్లీ సొంత ఊళ్లకు వెళ్లిపోవాల్సిందేనా? అని ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా లక్షలాదిమందికి ఉపాధి ఇస్తున్న ముంబైలో కరోనా భూతం మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గతంలో కరోనా విషయంలో ముంబై ఎంతగా అతలాకుతలం అయిపోయింది తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ముంబై వాసులు ముఖ్యంగా పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు మరోసారి లాక్ డౌన్ వస్తుందని భయపడిపోతున్నారు.

1

 

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూన్న క్రమంలో వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు మరోమారు లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ దిశగా ఆలోచిస్తోందన్న వార్తలు చాలామందిని కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇళ్లలో పనులు చేసుకంటూ జీవనం సాగించే ఎందరో పేదింటి మహిళలు తీవ్రంగా ఆందోళనలకు గురవుతున్నారు.

2

గతేడాది అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల వారు ఇప్పటికే ఎంతగానో నష్టపోయారు. అప్పులపాలైపోయారు. ఉన్న ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లి గవ్వ లేక పస్తులుండాల్సిన పరిస్ధితి వచ్చింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో గత ఆరు నెలలుగా వారికి ఏదో ఒక ఉపాధి దొరికింది. దీంతో వారి కుటుంబాలకు కొంత ఆధారం లభించినట్లు అయింది. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ వస్తుందనే భయంతో ఉన్న పని కోల్పోతామనే భయం వెన్నాడుతోంది. ఒకవేళ మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తే తమ కుటుంబ పరిస్ధితి ఏంటని తలచుకుంటూ వారు బాధపడుతున్నారు.

 

10

ముంబై పరిసరాల్లో 35 లక్షల మంది మహిళా కార్మికులు
భారత్ లోని ఎన్నో నగరాల్లో పేదలకు ఉపాధి పొందుతున్నారు. ఉన్నఊరిని బంధువుల్ని వదలి నగర బాటపడుతున్నారు. అటువంటి నగరాల్లో ముంబై ప్రధానమైనది. ముంబై, థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేసే మహిళా కార్మికులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. వీరిలో కొంత మంది ఇటుక బట్టీలలో పనులు చేసుకుంటుండగా.. మరికొందరు ఇతర రోజువారీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకంటున్నారు.

15

వీరిలో ఎక్కువ శాతం మంది ధనవంతుల ఇళ్లలో ఇంటి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గత కొంతకాలంగా ముంబైతో పాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో, శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైనా లాక్‌డౌన్‌ అమలు చేసే అవకాశం ఉందని ప్రచారంతో 2020 పరిస్ధితులు మళ్లీ వస్తాయని బెంబేలెత్తిపోతున్నారు.

11

తమకు వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళలు ముంబైలో లక్షలాదిమంది ఉన్నారు. వీరికి సొంత ఇళ్లు కూడా లేకపోవడంతో అద్దె ఇళ్లలో ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తే ఇంటి అద్దె కూడా కట్టుకోలేని దుస్థులు వస్తాయి. గత లాక్‌డౌన్‌ తో అప్పులపాలై..పిల్లల చదువు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.

156

కానీ పరిస్థితులు చక్కబడ్డాయని తిరిగి వచ్చి చిన్నపాటి పనులు వెతుక్కుని బతుతుకున్నవాళ్లు మళ్లీ ఉపాథి పోతుందనే భయం వెన్నాడుతోంది. గతంలో చేసిన పని ఇప్పుడు దొరలేదు. దీంతో కొత్త పనులు వెతుక్కుని ఎలాగోలా బతుకుతున్నారు. కానీ ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి వస్తుందనే మాటకే భయపడిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ పెడితే తాముంటున్న అద్దె ఇళ్లు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోవాల్సిందేనని పేద మహిళలు వాపోతున్నారు.