Covid-19 Updates : దేశంలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 1,233 కేసులు, 31 మరణాలు
Covid-19 Updates : భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది మరణించారు..

Covid 19 Updates India Logs 1,233 New Cases Of Covid 19, Active Infections At 14,707
Covid-19 Updates : భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది మరణించారు.. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 4,24,87,410 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 14,704గా ఉంది. యాక్టివ్ కేసుల్లో 0.03 శాతానికి పడిపోయాయి. గత 24 గంటల్లో 1,876 రికవరీలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కరోనా రికవరీల సంఖ్య 4,24,87,410కి చేరింది.
దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.20శాతంగా మారింది. వారంలో పాజిటివిటీ రేటు 0.25శాతంగా మారింది. కరోనా యాక్టివ్ కేసులు చాలా రోజుల తర్వాత 15వేలకు దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 14,704 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. భారత్‌లో ఇప్పటి వరకూ 4,30,23,215 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా కారణంగా 5,21,101 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,83,82,41,743 మందికి కరోనా వ్యాక్సినేషన్ అందించారు. ఇక వ్యాక్సిన్ పాజిటివిటీ రేటు 0.20 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 6,24,022 కోవిడ్ పరీక్షలను నిర్వహించగా.. దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం టెస్టులు 78.85 కోట్లకు పైగా ఉన్నాయి.
భారత్ COVID-19 టీకా కవరేజీ 183.79 కోట్లు (1,83,79,06,022) దాటింది. 12-14 ఏళ్ల వయస్సు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 1.50 కోట్ల (1,50,55,291) కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోస్‌లు అందాయి. వీటిలో 12,74,719 మంది గత 24 గంటల్లో టీకాలు అందుకున్నారు. గత 24 గంటల్లో 1,34,837 మందికి టీకాలు వేయగా.. ఇప్పటివరకు 2.28 కోట్ల (2,28,71,399) కోవిడ్ వ్యాక్సిన్ ప్రీకాషన్ డోసులను అందించారు.
Read Also : Covid-19 Deaths : కరోనా మరణాలు భారత్‌లోనే తక్కువ.. ఆ వార్తలు నమ్మొద్దు.. WHO డేటా ఇదిగో..!