IRCTC : సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న క్రూజ్‌ లైనర్‌

తోలి స్వదేశీ క్రూజ్ లైనర్ సేవలను సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభించనున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది.

IRCTC : సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న క్రూజ్‌ లైనర్‌

Irctc

Updated On : September 9, 2021 / 1:36 PM IST

IRCTC : తోలి స్వదేశీ క్రూజ్ లైనర్ సేవలను సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభించనున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. కార్డెలియా క్రూజెస్ అనే ప్రైవేట్ కంపెనీ బాగస్వామస్యంతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. గోవా, డయ్యు, లక్షద్వీప్‌, కోచి, శ్రీలంక తదితర ప్రాంతాలకు వీటిని నడపనుంది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.

ముంబై నుంచి లక్షద్వీప్ కు 5 రాత్రులు, 6 పగళ్లు ప్రయాణానికి ఒక మనిషికి రూ.49,745 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తోంది. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు ‘ఐఆర్‌సీటీసీటూరిజమ్‌.కామ్‌’ కి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2022 మే తర్వాత ఈ సర్వీసులు విస్తరించనున్నారు. చెన్నై మీదుగా శ్రీలంక, కొలంబో, గాలే, ట్రింకోమాలీ, జాఫ్నా తదితర ప్రాంతాలకు సేవలను విస్తరించనుంది.

అయితే ఇందులో టికెట్ రేట్లు మాత్రం భారీగా ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి వ్యక్తులు ఇందులో ప్రయాణించడం అంత సులువేం కాదని తెలుస్తోంది.