Indore Temple Stepwell Collapse : భక్తుల్ని మింగేసిన బావి .. ఇండోర్ బావి ప్రమాదంలో 35కు చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో బాలేశ్వర్ ఆలయంలోని బావి భక్తుల్ని మింగేసింది. మెట్లబావి పైకప్పు కుప్పకూలిన పెను విషాద ఘటనలో మృతుల సంఖ్య 35కు పెరిగింది.

Death reaches to 35..Indore temple stepwell collapse
Indore Temple Stepwell Collapse : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో బాలేశ్వర్ ఆలయంలోని బావి భక్తుల్ని మింగేసింది. మెట్లబావి పైకప్పు కుప్పకూలిన పెను విషాద ఘటనలో మృతుల సంఖ్య 35కు పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 19మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.
ఇండోర్‌లోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో స్థలం సరిపోకపోవటంతో కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చుకున్నారు. ఎక్కువ మంది భక్తులు అదే ప్రాంతంలో గుమ్మిగూడటంతో అధికభారతంలో పురాతన మెట్ల బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపు 50మంది భక్తులు బావిలోకి పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడి చికిత్స పొందుతున్నారని నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంనుంచి 19 మందిని రక్షించారు.
Indore: ఇండోర్‌లో నవరాత్రి వేడుకల్లో విషాదం.. మెట్లబావిలో పడిపోయిన భక్తులు..