ప్రజల తీర్పుపై ఉత్కంఠ : ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ భారీ భధ్రత

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 08:50 PM IST
ప్రజల తీర్పుపై ఉత్కంఠ : ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ భారీ భధ్రత

Updated On : February 10, 2020 / 8:50 PM IST

దేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు తెరవనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 33 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2 వేల 600 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 

మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను కౌంటింగ్ చేస్తారు. ప్రతిదీ పారదర్శకంగా నిర్వహిస్తామని ఢిల్లీ స్పెషల్ సీఈవో సత్నం సింగ్ తెలిపారు. ఒకవేళ ఈవీఎంలలో ఏవైనా టెక్నికల్ సమస్యలు ఏర్పడితే..వెంటనే పరిష్కరించడానికి మెషిన్లు తయారు చేసిన ఇంజనీర్లు కౌంటింగ్ కేంద్రాల్లో ఉంటారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు, మధ్యాహ్నం వరకు ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 
 

పకడ్బందీ భద్రత
అత్యంత పకడ్బంది భద్రత నడుమ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం..కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ వెల్లడించారు. పారమిలటరీ దళాలు, రాష్ట్ర సాయుధ పోలీసులు, స్థానిక పోలీసులు పహారాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లెక్కించే రోజు వరకు కనీసం 200 మంది భద్రతా సిబ్బంది కాపాలాగా ఉంటారన్నారు. 

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐడీ కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతినించడం జరుగుతుందని, ఇతరులను అనుమతించబోమని భద్రతా అధికారి తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ర్యాంకుకు చెందిన సీనియర్ ఆఫీసర్లతో సహా ప్రతి కేంద్రంలో 500 మంది సిబ్బంది ఉండడం జరుగుతుందని డిప్యూటీ పోలీసు కమిషనర్ శరత్ సిన్హా తెలిపారు. 

అంతేగాకుండా…కేంద్రాల్లో ప్రతి వస్తువును క్షుణ్ణంగా స్కానింగ్ చేసిన తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుందన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఫుటేజ్‌లను అభ్యర్థులకు, వారి రాజకీయ ఏజెంట్లకు ఇవ్వబడుతుందన్నారు. 

ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 08వ తేదీ ఎన్నికల పోలింగ్ జరిగింది. 62.59 ఓటింగ్ శాతం నమోదైంది. అధికార పార్టీ ఆప్, బీజేపీ పార్టీ మధ్య గట్టిపోటీ నెలకొంది. ఆప్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 672 మంది పోటీ పడ్డారు ఈ ఎన్నికల్లో.