Delhi Liquor Case: ‘స్టింగ్ ఆపరేషన్ వీడియో’ను విడుదల చేసిన బీజేపీ.. మనీష్ సిసోడియా తప్పించుకోలేడన్న సంబిత్ పట్రా

ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో బీజేపీ వర్సెస్ ఆమ్‌ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ మద్యం స్కాంలో బీజేపీ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. మనీష్ సిసోడియాకు ఇక తప్పించుకునే మార్గం లేదని బీజేపీ నేత సంబిత్ పట్రా అన్నారు.

Delhi Liquor Case: ‘స్టింగ్ ఆపరేషన్ వీడియో’ను విడుదల చేసిన బీజేపీ.. మనీష్ సిసోడియా తప్పించుకోలేడన్న సంబిత్ పట్రా

Delhi liquor case

Updated On : September 5, 2022 / 2:50 PM IST

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో బీజేపీ వర్సెస్ ఆమ్‌ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ మద్యం స్కాంలో బీజేపీ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. సోమవారం బీజేపీ నేత సంబిత్ పట్రా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఈ వీడియోను మీడియా ఎదుట ఉంచారు. ఢిల్లీలోని మద్యం వ్యాపారులు భయపడవద్దని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సింపోడియా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎంత కమీషన్ ఇచ్చారో వీడియోలు రూపొందించాలని సంబిత్ పట్రా కోరారు.

Delhi Liquor Scam : పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసిన సీబీఐ

బీజేపీ స్టింగ్ ఆపరేషన్ చేసి విడుదల చేసిన వీడియోలో.. 80శాతం లాభం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, వారి స్నేహితుడికి వెళ్తుంది. మొదట మీరు మా 80శాతం ఇవ్వండి, ఆపై 20శాతం మీకు వీలైతే అమ్మండి, మేము పట్టించుకోము.. ఇది కేజ్రీవాల్ పాలసీ అని ఆరోపిస్తూ బీజేపీ ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ‘స్టింగ్ వీడియో’లో ఉంది సన్నీ మార్వా తండ్రి కుల్విందర్ మార్వా. ఢిల్లీ మద్యం స్కామ్‌లో 12వ వ్యక్తి. మార్వా స్వయంగా ఈ వీడియోలో ఇవన్నీ ఒప్పుకుంటున్నారని, మనీష్ సిసోడియాకు ఇక తప్పించుకునే మార్గం లేదని సంబిత్ పట్రా అన్నారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

ఇదిలాఉంటే బీజేపీ స్టింగ్ ఆపరేషన్ పై ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇంకా స్పందన రాలేదు. మద్యం కుంభకోణంలో గత నెలలో మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేసిన విషయం విధితమే. అతని బ్యాంక్ లాకర్‌ను కూడా సీబీఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్, సిసోడియాపై మద్యం కేసులో వచ్చిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా బీజేపీ అతనిని టార్గెట్ చేసిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు.