Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఢిల్లీ ఎర్రకోట.. ప్రధాని మోదీ ప్రసంగించే అంశాలివే?

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై 10వ సారి ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఢిల్లీ ఎర్రకోట.. ప్రధాని మోదీ ప్రసంగించే అంశాలివే?

Independence Day 2023

Delhi Red Fort: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. రెండేళ్ల తరువాత కోవిడ్ ఆంక్షల రహితంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. వరుసగా 10వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగువేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 30వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,800 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం జరిగింది. వీరిలో సర్పంచులు, రైతులు, పార్లమెంట్ నిర్మాణ కార్మికులు, రోడ్ల నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, హర్ ఘర్ జల్ కార్మికులు, ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్య కారులు ఉన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి జంటలను తమ రాష్ట్ర సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం ఢిల్లీలోని ఆయా రాష్ట్రాల భవన్లకు కేంద్రం బాధ్యతలు అప్పగించింది.

Independence Day 2023: గోల్కొండకోట పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే..

పటిష్ట భద్రత..

ఆహ్వానితుల్లో హై-సెక్యూరిటీ జోన్‌లో 268 మంది వీఐపీలకు చోటు కల్పించారు. జ్ఞాన్‌పథ్‌లో 1,000 మందికి, మాధవ్‌దాస్ పార్క్‌లో 4,766 మందికి, ఆగస్ట్ 15 పార్క్‌లో 20,450 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేశారు. మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 10వేల మంది భద్రతా సిబ్బందితో నాలుగు అంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకోసం 1,000 సెక్యూరిటీ కెమెరాలు, 16 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు నుంచి నాలుగు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతోపాటు భద్రతా విధుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలుకూడా పాల్గోనున్నాయి. మరోవైపు సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు.

Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి.. ఏం చెప్పారంటే

ప్రధాని మోదీ ప్రసంగించే అంశాలివే..?

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై 10వ సారి ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం మోదీ ప్రసంగిస్తారు. అయితే, వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక అంశాలను తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది. రానున్న 25ఏళ్లు (అమృత్ కాల్) లక్ష్యాల గురించి వివరించే అవకాశం ఉంది. ప్రభుత్వ విజయాలతో పాటు కొత్త పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించే అవకాశం ఉంది. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న చట్టాల గురించి ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు, విపక్ష కూటమి గురించి ఎర్రకోట వేదికగా మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది.