Delhi Air Pollution : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం : అప్పటివరకూ స్కూళ్లు తెరిచేది లేదు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం కొనసాగుతుండటంతో స్కూళ్లు మూసివేశారు. వారం రోజులు గడిచినా ఇప్పటికీ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు.

Delhi Air Pollution : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం : అప్పటివరకూ స్కూళ్లు తెరిచేది లేదు

Delhi Schools To Remain Closed Till Further Notice Due To Air Pollution (1)

Updated On : November 21, 2021 / 6:51 PM IST

Delhi Schools Close : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం కొనసాగుతుండటంతో స్కూళ్లు మూసివేశారు. వారం రోజులు గడిచినా ఇప్పటికీ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు. ఇప్పట్లో వాయు కాలుష్యం తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ విద్యాశాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. భవిష్యత్‌లో ప్రకటన చేసేవరకు ఎవరు స్కూళ్లు ఓపెన్ చేయవద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని అన్ని స్కూళ్లను మూసివేయాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. మరికొద్ది రోజుల పాటు స్కూళ్లు మూతపడనున్నాయి.

ఈ సమయంలో కేవలం ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నడుపుకోవచ్చునని తెలిపింది. NCR సహా ఇతర సమీప ప్రాంతాల్లోని అన్ని స్కూళ్లు తక్షణమే మూసివేయాలని పర్యావరణ శాఖ సూచనలు చేసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ అదనపు డైరెక్టర్ రితా శర్మ పేర్కొన్నారు. ఆన్ లైన్ టీచింగ్ లెర్నింగ్ క్లాసులు, బోర్డు పరీక్షలను ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్వహించనున్నట్టు అధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నవంబర్ 13న కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యంపై సమీక్షించిన కేజ్రీవాల్.. వారం రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ అధికారులకు వర్క్‌ ఫ్రం హోంను ప్రకటించారు.

ఆ మరుసటి రోజున హర్యానా ప్రభుత్వం కూడా గుర్గావ్, ఫరీదాబాద్, సోనిపేట్, ఝిజార్ నాలుగు నగరాల్లో స్కూళ్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా, జాతీయ రాజ‌ధాని ప్రాంతంలో వాయు కాలుష్యం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని త‌ల‌పిస్తోంద‌ని సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కాలుష్య నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సుప్రీం పేర్కొంది. మరోవైపు.. ఉష్ణోగ్రత తగ్గుదల, గాలి వేగం కారణంగా ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని పీసీబీ తెలిపింది.సంసిద్ధతతో ఉండాలని రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలను పీసీబీ ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఢిల్లీని పొగ మంచు కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 470ని తాకింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వ్యవసాయ భూముల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల విషపూరితమైన పొగమంచు ఢిల్లీ అంతటా వ్యాపిస్తోంది.

Read Also : Moto G200 : మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. ఇండియాకు వచ్చేస్తోంది!