ED Raids: మొబైల్ యాప్ మోసం కేసులో ఈడీ దాడులు.. రూ.17.3 కోట్ల నగదు స్వాధీనం
మొబైల్ యాప్ కు సంబంధించి మోసంకేసులో కోల్‌కతాలోని ఆరు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సాయంత్రం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.17 కోట్ల 32 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.

ED Rids
ED Raids: మొబైల్ యాప్ కు సంబంధించి మోసంకేసులో కోల్‌కతాలోని ఆరు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సాయంత్రం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.17 కోట్ల 32 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) 2002 నిబంధనల ప్రకారం ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. మొబైల్ గేమింగ్ అప్లికేషన్‌కు సంబంధించి దర్యాప్తుపై ఈ దాడులు జరిగాయి.
‘ఈ-నగ్గెట్స్’ అనే మొబైల్ గేమింగ్ యాప్‌ను తయారు చేసి అమీర్‌ఖాన్, అతని అనుచరులు భారీ మోసానికి పాల్పడ్డారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఐపీఎస్ సెక్షన్లు 420, 406, 409, 468, 469, 471, 34 కింద 15 ఫిబ్రవరి 2021న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేయబడింది. ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఎల్డీ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా యాప్ డెవలపర్ అమీర్ ఖాన్, మరికొంత మందిపై కోల్‌కతా పోలీసులు కేసునమోదు చేశారు.
#WATCH | Kolkata, WB: Stacks of cash amounting to several crores have been recovered from the residence of businessman Nisar Khan during ED's raid ongoing for several hours pic.twitter.com/o2qXzNSmDR
— ANI (@ANI) September 10, 2022
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో అమీర్‌ఖాన్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు ఈడీ దిగింది. బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ బృందం, గార్డెన్ రీచ్ ప్రాంతంలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసంలో సోదాలు చేపట్టింది. మొత్తం రూ.17కోట్ల 32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ యాప్, దాని ఆపరేటర్‌లకు ఇతర “చైనీస్ నియంత్రిత” యాప్‌లతో లింక్‌లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది.