Covid 19 : ట్యూషన్‌ సెంటర్‌లో కరోనా కలకలం.. 8మంది విద్యార్థులకు పాజిటివ్

ఓ ట్యూషన్‌ సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.

Covid 19 : ట్యూషన్‌ సెంటర్‌లో కరోనా కలకలం.. 8మంది విద్యార్థులకు పాజిటివ్

Covid 19 Tuition Centre

Updated On : October 16, 2021 / 8:00 PM IST

Covid 19 : యావత్ దేశాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడిప్పుడు అదుపులోకి వస్తోంది. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. ఇక విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు క్లాసులకు అటెండ్ అవుతున్నారు. అంతటా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి, ఇక భయం లేదు అని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా మళ్లీ కరోనా కలకలం రేగింది.

Power Cut : ఏపీలో రోజూ 4 గంటలు కరెంట్ కట్..? ఇందులో నిజమెంత

గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో ఓ ట్యూషన్‌ సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ట్యూషన్‌ సెంటర్‌ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్లే విద్యార్థి ఒకరు ఈ నెల 7న కరోనా బారిన పడ్డాడు. దీంతో మొత్తం 125 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో మరో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. మరింత మందికి కరోనా సోకకుండా ట్యూషన్‌ సెంటర్‌ను మూసేశారు.

Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..

సూరత్‌ విద్యా సంస్థల్లో కోవిడ్‌ కేసులు వెలుగు చూడటం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెలారంభంలో కొంత మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో ఓ ప్రైవేటు స్కూల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. సూరత్ నగరంలో ఇప్పటివరకు 1,11,669 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,09,975 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,629 మంది కరోనాతో చనిపోయారు.