మేం దేశం కోసం పనిచేస్తాం..మతం కోసం కాదు: ప్రధాని మోడీ

బీజేపీ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తుంది కానీ మతం కోసం కాదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం (డిసెంబర్ 22) ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో బీజేపీ కృతజ్ఞత సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ..పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని కూడా సైతం కొంతమంది గౌరవించటం లేదని అన్నారు. పౌరసత్వం చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయనీ..సోషల్ మీడియా దీనికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ..ప్రచారాన్ని చేస్తున్నారనీ..ఇటువంటిపనులు చేస్తు ప్రజల మధ్య విభేధాలు సృష్టిస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు.
పౌరసత్వ చట్టంపై తప్పుడు ప్రచారాలు : ప్రధాని
తాము దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేస్తాం తప్ప మతం కోసం కాదని ప్రధాని ఈ సందర్బంగా స్పష్టం చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అనీ..అటువంటి భారతీయులు కలిసి మెలిసి ఉండటాన్ని తట్టుకోలేని కొంతమందికావాలనీ పౌరసత్వ చట్టంపై లేని పోని అపోహల్ని క్రియేట్ చేస్తూ..తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి దుష్ట శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని దేశ ప్రజలకు సూచించారు. ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామనీ..వాటి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాం. ఇటువంటి సమయంలో ఇటుప్రచారాలు తమను ఏమీ చేయలేవనీ ఇటువంటివారి విషయంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మతం మా అభిమతం కాదు : ప్రధాని
మతాలకు అతీతంగా ఢిల్లీలో అనధికారిక కాలనీలను రెగ్యులరైజ్ చేశామని ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలిపారు. ఈ రెగ్యులరైజ్ కోసం ప్రజలను ఎటువంటి దృవీకరణ పత్రాలు కూడా అడగలేదని అన్నారు. మతం మా అభిమతం కాదు..మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామనీ..ఇప్పటికే తాము అధికారంలోకి వచ్చాక 8 కోట్లమందికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చామన్నారు. అప్పుడు మేము మతాలను చూసి ఇచ్చామా? అని ప్రధాని ప్రశ్నించారు. పౌరసత్వం చట్టం విషయంలో ఢిల్లీలో ప్రజలను రెచ్చగొట్టి కొంతమంది వేడుక చూస్తున్నారనీ..వారి ఆటలు సాగనివ్వమని అన్నారు. ఇటువంటి చర్యలతో భారతదేశంపు ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నుతున్నారని ప్రధాని అన్నారు. అటువంటివారి మాటలు నమ్మవద్దని..ప్రధాని మోదీ బీజేపీ కృతజ్ఞత సభ వేదికగా సూచించారు.