జర్నలిజానికి బ్రేకింగ్ న్యూస్ వ్యాధి పట్టింది: రాష్ట్రపతి

జర్నలిజానికి బ్రేకింగ్ న్యూస్ వ్యాధి పట్టింది: రాష్ట్రపతి

Updated On : January 21, 2020 / 1:43 AM IST

భారత్‌లో మీడియాకు వ్యాధి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ వ్యాధితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. నేటి రోజుల్లో ఫేక్ న్యూస్‌తో మీడియాకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలతో తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొంటున్నారంటూ అంతగొప్ప ఉద్యోగాన్నే కించపరుస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఢిల్లీలో సోమవారం జరిగిన రామ్‌నాథ్‌ గోయెంకా ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా పాల్గొని మాట్లాడారు. 

పాత కాలంలో ఐదు డబ్ల్యూ, హెచ్‌లతో వార్తలు ఉండేవని  (what, when, why, where, who and how)  (ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ ఎవరు లేదా ఎలా) గుర్తు చేశారు. ‘తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొంటూ ఫేక్ వార్తలు ముప్పు తీసుకొస్తున్నారు’ అన్నారు. ‘ఈ రోజుల్లో మీడియా ఇన్వెస్టిగేటర్, ప్రాసిక్యూటర్‌, జడ్జి పాత్రలను ఒక్కటే పోషించేస్తుంది’ అని అన్నారు. 

నిజాలు తెలుసుకోవడానికి జర్నలిస్టులు పాషన్‌తో మరింత కష్టపడాలి. వారి ప్రత్యేకత వెలకట్టలేనిది. పవర్ తుడిచి పెట్టేయగలిగినంత సామర్థ్యం ఉన్నవారు.. నిజమైన జవాబుదారీతనంతో ఉండాలి’ వార్తల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి బదులుగా పాఠకుల దృష్టిని ఆకర్షించేందుకు, రేటింగ్స్‌ కోసం అన్వేషిస్తూ నిర్హేతుకమైన పద్ధతులను పాటిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

సామాజిక, ఆర్థిక అసమానతలను బహిర్గతం చేసే వార్తలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు.