ఫ్యాన్సీ నంబర్ రికార్డ్ : రూ31 లక్షలు

తిరువనంతపురం : సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. తమ వెహికల్ కు ఫ్యాన్సీ నంబర్ల కోసం..లక్కీ నంబర్స్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారనే విషయం తెలిసిందే. లక్షలు..(కోటి కూడా ఉండొచ్చు) పోసి కొన్న కార్ల కోసం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా అనుకుంటారో ఏమో గానీ ఓ వ్యక్తి తన కారు ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.31 లక్షలు ఖర్చు పెట్టాడు. అతనే దేవి ఫార్మ అధినేత అయిన బాలగోపాల్.
2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించిన బాలగోపాల్ రూ. కోటి పెట్టి కొన్న ‘‘పోర్షే 718 బాక్స్‌టర్’’ కారుకు..ఫ్యాన్సీ నంబర్ (KL01-CK0001)ను రికార్డు స్థాయి రేటు పెట్టి సొంతం చేసుకున్నారు. ఈ నంబర్ కోసం పోటాపోటీగా వేలం షైన్ యూసుఫ్ అనే ఎన్నారై.. రూ. 25 లక్షల వరకు పోటీని ఇచ్చిన క్రమంలో ఎట్టకేలకు రూ. 31 లక్షలకు చేరుకుని (కేఎల్01-సీకే0001) నంబర్‌ను దక్కించుకున్నారు. బాలగోపాల్. ఫ్యాన్సీ నంబర్ కోసం పలుకుబడులను కూడా ఉపయోగించుకుంటున్న సందర్భాలు కూడా లేకపోలేదు.. ఈ క్రమంలో ఒక ఫ్యాన్సీ నంబరుకు రూ. 31 లక్షలు వెచ్చించడం దేశంలోనే ఒక రికార్డు అని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
2017లోనూ ఆయన తన లాండ్ క్రూయిజర్ కారుకు కేఎల్01-సీబీ0001 కోసం రూ. 19 లక్షలు వెచ్చించాడు. అప్పట్లో అదే పెద్ద రికార్డు.