సూసైడ్ నోట్ : బీజేపీకి ఓటు వేయద్దు.. రైతు ఆత్మహత్య 

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు హమీలు మీద హామీలు గుప్పిస్తుంటాయి. రైతుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామంటూ తియ్యని పలుకులు పలుకుతూ.. అబద్దపు హమీలు ఇవ్వడం కామన్.

  • Published By: sreehari ,Published On : April 12, 2019 / 07:28 AM IST
సూసైడ్ నోట్ : బీజేపీకి ఓటు వేయద్దు.. రైతు ఆత్మహత్య 

Updated On : April 12, 2019 / 7:28 AM IST

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు హమీలు మీద హామీలు గుప్పిస్తుంటాయి. రైతుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామంటూ తియ్యని పలుకులు పలుకుతూ.. అబద్దపు హమీలు ఇవ్వడం కామన్.

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు హమీలు మీద హామీలు గుప్పిస్తుంటాయి. రైతుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామంటూ తియ్యని పలుకులు పలుకుతూ.. హమీలు ఇస్తుంటారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాలు.. తమకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కేస్తున్నారంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట నష్టపోయిన రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పంట కోసం చేసిన అప్పులకు వడ్డీలు తీర్చలేక చివరికి.. చావే శరణ్యమని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అప్పుల భారమే ఆత్మహత్యకు కారణం :
అధికార ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను నెరవేర్చకపోవడంతో అప్పుల బాధతో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు చెందిన ఈశ్వర్ చంద్ శర్మ (65) రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భారీగా అప్పులు పెరిగిపోవడమే ఈశ్వర్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రైతు ఈశ్వర్.. తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్ లో తన అప్పులుకు బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాశాడు. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రైతులను నాశనం చేసిందన్నాడు. బీజేపీ ఓటు వేయొద్దని సూసైడ్ నోట్ లో తెలిపాడు. 

బీజేపీకి ఓటు వేయొద్దు.. లేదంటే.. అందరిని టీ అమ్మేలా చేస్తుంది’అని రైతు తన సూసైడ్ నోట్ లో వాపోయాడు. రైతు సూసైడ్ నోట్ లో ఎంతవరకు నిజం ఉంది అనేదానిపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఓ వ్యక్తి.. బ్యాంకు ఏజెంట్ లా వచ్చి బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసినట్టు సూసైడ్ నోట్ లో తెలిపాడు. పోలీసుల విచారణలో.. రైతు ఈశ్వర్.. మధ్యవర్తి ద్వారా బ్యాంకులో రూ.5 లక్షలు లోన్ తీసుకున్నట్టు గుర్తించారు. బ్యాంకు లోన్ ఇప్పించిన మధ్యవర్తి రైతు శర్మ నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్టు స్టేషన్ హౌస్ అధికారి లక్షర్ వీరేంద్ర సింగ్ తెలిపారు.

రైతు ఆత్మహత్యపై స్పందించిన కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోడీ తన మేనిఫెస్టోలో రైతులకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారని, మోడీ విధానాలతోనే రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సూర్యకాంత్ దహసామ్నా ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ప్రతినిధి దేవేంద్ర బాసిన్ తీవ్రంగా ఖండించారు. రైతు ఆత్మహత్యను అడ్డం పెట్టుకుని బీజేపీపై బురద జల్లేందుకు యత్నిస్తోందని బాసిన్ మండిపడ్డారు.