Viral Video: రెస్టారెంటులో అందరూ చూస్తుండగా సిబ్బంది, ఓ కుటుంబం తన్నులాట.. ఎందుకంటే?

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Viral Video: రెస్టారెంటులో అందరూ చూస్తుండగా సిబ్బంది, ఓ కుటుంబం తన్నులాట.. ఎందుకంటే?

Viral Video

Updated On : June 19, 2023 / 7:28 PM IST

Viral Video – Noida: రెస్టారెంటులో ఓ కుటుంబం భోజనం చేసింది. ఆ తర్వాత రెస్టారెంట్ సిబ్బంది బిల్లు ఇచ్చారు. అందులో సర్వీస్ ఛార్జి విషయంపై ఆ కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ సిబ్బంది గొడవపడ్డారు. చివరకు వారంతా కలిసి రెస్టారెంటులోనే కొట్టుకునే వరకు వెళ్లింది వ్యవహారం. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. స్పెక్ట్రమ్ మాల్ (Spectrum Mall) కు వచ్చిన ఆ కుటుంబం హాయిగా తిని ఎంజాయ్ చేద్దామనుకుంది. అయితే, వారికి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ బౌన్సర్లు, ఆ కుటుంబంలోని వారు పరస్సరం తిట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు.

వారిలో మహిళలు కూడా ఉన్నారు. తన్నులాటను ఆపడానికి కొందరు ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఫలించలేదు. రెస్టారెంటులో గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వీస్ ఛార్జితో కలిపి బిల్ ఇచ్చినందుకు కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తప్పు ఎవరిదో తేల్చి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Viral Video: గ్రాడ్యుయేషన్ పాసైన ఆనందంతో డాన్స్ చేసింది.. అదే ఆమె కొంప ముంచింది