Nirmala Sitharaman: సీఎంలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశం

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(15 నవంబర్ 2021) సమావేశం కానున్నారు.

Nirmala Sitharaman: సీఎంలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశం

Nirmala

Updated On : November 15, 2021 / 9:47 AM IST

Nirmala Sitharaman Meeting: రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(15 నవంబర్ 2021) సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా, సంస్కరణ ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడం మరియు పెట్టుబడులను ఆకర్షించడం వంటి మార్గాలపై చర్చలు జరుగుతాయి. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, భగవత్ కరాద్ కూడా పాల్గొంటారు.

దేశవృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణల ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై చర్చ జరగనుంది. పెట్టుబడులను పెంచేందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ఈ సమావేశంలో కీలకం కానున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా మహమ్మారి రెండు విడతలుగా విరుచుకుపడి దేశ వ్యాప్తంగా కకావికలం వృద్ధిని ప్రోత్సహించే చర్యలు, సంస్కరణలు, పెట్టుబడి ప్రోత్సాహం, సంస్కరణ ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడంపై సమావేశంలో చర్చించనున్నారు.

ఆర్థిక వ్యవస్థ వేగంగా పునరుద్ధరణ, మూలధన వ్యయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చర్చ జరగనుంది.