Goa Corona తో 85 ఏళ్ల మహిళ మరణం

  • Published By: madhu ,Published On : June 22, 2020 / 07:20 AM IST
Goa Corona తో 85 ఏళ్ల మహిళ మరణం

Updated On : June 22, 2020 / 7:20 AM IST

ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న గోవాలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. కరోనా రహితంగా ఉన్న గోవాలో కరోనా వైరస్ తో చనిపోయిందనే విషయం కలకలం రేపుతోంది. గత నెల నుంచి ఇక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా గోవా ప్రభుత్వ పకడ్బంది చర్యలు చేపడుతోంది.

మోర్లెమ్ కు చెందిన 85 ఏళ్ల మహిళ కరోనా వైరస్ తో చికిత్స పొందుతోంది. 2020, జూన్ 22వ తేదీ సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు. ఈ వైరస్ కారణంగా..ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 

కొత్తగా ఇక్కడ 64 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 818కి చేరింది. 683 మంది చికిత్స పొందుతుండగా 135 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 2020, జూన్ 21వ తేదీ ఆదివారం ఆరుగురు కరోనా రోగులను డిశ్చార్జ్‌ చేశారు.  

కర్ణాటకలోని బెలగావీ ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులును మూసివేసి, రాష్ట్రంలోకి వచ్చినవారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు గోవా అధికారులు. బెలగావీ నుంచే గోవాకు కూరగాయలు, పండ్లు పెద్ద సంఖ్యలో వస్తాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..గోవాకు బెలగావీ కీలకం కావడంతో పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు. 

జలపాతలకు వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు. పర్యాటకులు అధిక మంది ఈ వర్షాకాలంలో వస్తారని, పరిసర ప్రాంతాలను అపరిశుభ్రంగా మార్చివేస్తారని అంచనా వేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అది..వ్యాప్తి చెందుతుందని భావించి జాగ్రత్త పడుతున్నారు. 

Read: జైల్లో చనిపోయిన ఖైదీకి కరోనా పాజిటివ్.