ఇదే ఫస్ట్ : రైలు ఆలస్యమైతే.. ఇక డబ్బులు వాపస్!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యమైందా?

  • Published By: sreehari ,Published On : October 1, 2019 / 01:12 PM IST
ఇదే ఫస్ట్ : రైలు ఆలస్యమైతే.. ఇక డబ్బులు వాపస్!

Updated On : October 1, 2019 / 1:12 PM IST

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యమైందా?

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యమైందా? గంటకు పైగా స్టేషన్లో ఎదురుచూసినా రైలు రాలేదా? అయితే మీ టికెట్ డబ్బులు రీఫండ్ చేసుకోవచ్చు. ఈ మేరకు మంగళవారం (అక్టోబర్ 1, 2019) తేదీన భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది. అన్ని రైళ్లలో కాదండోయ్.. ఢిల్లీ-లక్నో తేజాస్ ఎక్స్ ప్రెస్ లో మాత్రమే.

ఈ రైలు ఆలస్యమైతే అందులోని ప్రయాణికులకు నష్టపరిహారం పొందవచ్చు. గంటకు కంటే ఎక్కువ సమయం రైలు ఆలస్యమైతే ప్యాసింజర్లకు రూ.వంద చొప్పున నష్టపరిహారం చెల్లిస్తారు. రెండు గంటలకు కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే రూ.250 వరకు నష్ట పరిహారం పెరగనుంది. ఐఆర్ సీటీసీలో ఫస్ట్ టైం ఇలాంటి కొత్త ఆఫర్‌ను తేజాస్ ఎక్స్ ప్రెస్‌‌కు వర్తింప జేశారు. 

అదనంగా రూ.25 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ బీమాను కూడా రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఈ రైల్లో ప్రయాణించే సమయంలో ప్యాసింజర్ల నుంచి ఎలాంటి వస్తువులైన దోపిడీకి గురితై ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద రూ.లక్ష వరకు కవరేజ్ ఉంటుంది. టికెట్ కౌంటర్లను ఓపెన్ చేసిన రెండు రోజుల్లోనే లక్నో నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి వెనక్కి ఐఆర్ సీటీసీ నడిపే తొలి రైలు తేజాస్ ఎక్స్ ప్రెస్ లో 2వేలకు పైగా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. బుకింగ్ చేసుకున్న తేజాస్ రైళ్లలో నెంబర్ 82501 లక్నో నుంచి ఢిల్లీకి, నెంబర్ 82502 ట్రైన్ ఢిల్లీ నుంచి లక్నోకు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 

ఇలోగా లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే  తేజాస్ రైల్లో 749 టికెట్లు బుకింగ్ కాగా.. రిటర్న్ జర్నీలో నవంబర్ 20 వరకు 1,549 టికెట్లు బుకింగ్ అయ్యాయి. ఇందులో దీపావళికి ముందుగా టికెట్ల బుకింగ్స్ అక్టోబర్ 23, అక్టోబర్ 26 తేదీల్లోనే ఎక్కువగా ఉన్నాయి. భారత రైల్వేలో ఐఆర్ సీటీసీ రాయితీతో పూర్తిగా నడిచే తొలి రైలు ఇదే కావడం విశేషం. అక్టోబర్ 4న తేజాస్ ఎక్స్ ప్రెస్ రైలుకు జెండా ఊపి..మరుసటి రోజు నుంచి సర్వీసులను రైల్వే బోర్డు ప్రారంభించనుంది.