చాలా అరుదు…ఆవు సిరల సాయంతో చిన్నారికి కాలేయ మార్పిడి

  • Published By: venkaiahnaidu ,Published On : January 9, 2020 / 01:08 PM IST
చాలా అరుదు…ఆవు సిరల సాయంతో చిన్నారికి కాలేయ మార్పిడి

Updated On : January 9, 2020 / 1:08 PM IST

హర్యాణా డాక్టర్లు అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఏడాది వయసున్న హూర్ సౌదీ చిన్నారికి ఆవు సిరల సాయంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించారు గురుగ్రామ్ లోని ఆర్టిమిస్ హాస్పిటల్ డాక్టర్లు. కొత్త కాలేయానికి రక్త సరఫరా కోసం ఆవులో ఉండే బొవైన్ జుగులార్ వెయిన్‌ను ఉపయోగించారు డాక్టర్లు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతం కావడంతో హూర్ తల్లిదండ్రులు హాస్పిటల్ సిబ్బందికి,డాక్టర్లకు కృతజ్ణతలు తెలిపారు. ఆవు నరం సాయంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్  విధానం ‘చాలా అరుదు’ అని ఆర్టిమిస్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.

ఆర్టిమిస్ హాస్పిటల్  సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గిరిరాజ్ బోరా మాట్లాడుతూ…హూర్ హాస్పిటల్ కు వచ్చినప్పుడు తన కాలేయ సమస్య కారణంగా చాలా వీక్ గా ఉంది. హూర్ 5 కిలోలు 200 గ్రాముల బరువు కలిగి ఉండి బిలియరీ అట్రేసియాతో బాధపడిందన్నారు. సౌదీ అరేబియాలో హూర్ కి ఆపరేషన్ జరిగింది. అయితే అది విజయవంతం కాలేదు.

దీంతో అక్కడి డాక్టర్లు హర్యాణాలోని ఆర్టిమిస్ హాస్పిటల్ కు వెళ్లాలని చిన్నారి తల్లిదండ్రులకు సూచించారు. కాడవర్(చనిపోయిన మనిషి శరీరం)సిర విరాళం భారతదేశంలో అందుబాటులో లేనందున మేము ఈ రకమైన మార్పిడి చేశాము. హూర్ కుటుంబసభ్యుల అనుమతి తర్వాత ఆవు నరం సాయంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇది చాలా అరుదైన సందర్భం. కొత్త కాలేయానికి రక్తాన్ని ప్రసారం చేయడానికి ఆవు సిరలు ఉపయోగించబడటం ఇది ప్రపంచంలోనే మొదటిది. ఈ సిరలు విదేశాల నుండి సేకరించబడ్డాయని ఆర్టిమిస్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రామ్‌దీప్ రే చెప్పారు. ఈ ఆపరేషన్ ను విజవంతంగా నిర్వహించిన డాక్టర్లకు ఆయన అభినందనలు తెలిపారు.