Cyber Attack : సైబర్ మోసానికి గురైన మాజీ క్రికెటర్

ఇంతకాలం అమాయకులను, టెక్నాలజీపై సరిగా అవగాహన లేని వారిని టార్గెట్ గా చేసుకొని ఆర్ధిక మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు పెద్ద పార్టీలకే టెండర్ వేస్తున్నారు.

Cyber Attack : సైబర్ మోసానికి గురైన మాజీ క్రికెటర్

Cyber Attack

Updated On : December 11, 2021 / 7:17 AM IST

Cyber Attack : ఇంతకాలం అమాయకులను, టెక్నాలజీపై సరిగా అవగాహన లేని వారిని టార్గెట్ గా చేసుకొని ఆర్ధిక మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు పెద్ద పార్టీలకే టెండర్ వేస్తున్నారు. కొడితే జాక్ పాట్ కొట్టాలన్న ఉద్దేశంతో డబ్బున్న వారికి మాయమాటలు చెప్పి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ధనవంతులు చాలామంది ఉన్నారు. కొందరు తాము మోసపోయినట్లు మీడియా ముందు వాపోగా మరికొందరు మాత్రం గుట్టుగా ఉన్నారు. దీనికి కారణం.. ఉన్నతస్థాయిలో ఉండికూడా ఇలా మోసపోవడం ఏంటనే మాట వస్తుందనే ఉద్దేశమే కావచ్చు.

చదవండి : Cyber Attack : ఇంట్లో అద్దెకు వస్తామని రూ.2 లక్షలు కాజేశారు

అయితే తాజాగా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి కాంబ్లితో మాటలు కలిపాడు. కేవైసీ వివరాలు అప్డేట్ చెయ్యాలని.. లేదంటే మీ డెబిట్, క్రెడిట్ కార్డులు డీయాక్టీవ్ట్ అవుతాయనడంతో మోసగాడి మాయమాటలు నమ్మిన కాంబ్లి అతడు చెప్పినట్లు చేశాడు. ఫోన్ లో ఎనిడెస్క్ యాప్ ఇంస్టాల్ చేసి కనెక్టింగ్ నంబర్ సైబర్ నేరగాడికి చెప్పేశాడు. ఈ తతంగా అంతా వినోద్‌ను ఫోన్‌లైన్‌లో ఉంచే కానిచ్చేశారు. ఫోన్ కట్ చేయగానే అకౌంట్ లో డబ్బులు కట్ అయినట్లు సందేశం రావడంతో వెంటనే బాంద్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చదవండి : Cyber Crime : మిత్రుడి ఫోటోతో వాట్సప్ చాటింగ్-రూ.30 వేలు కాజేసిన సైబర్ నేరస్థుడు

కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టి.. నగదు ట్రాన్ఫర్ అయిన అకౌంటును గుర్తించారు. అనంతరం దాని నుంచి రివర్స్ ట్రాన్సాక్షన్ విధానం ద్వారా తిరిగి నగదును కాంబ్లి ఖాతాలోకి రప్పించారు. దీంతో పోలీసులకు కృతఙ్ఞతలు తెలిపారు కాంబ్లి.. సైబర్ దాడి జరిగినట్లు తెలిసిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలనీ.. ఫిర్యాదు గంటల వ్యవధిలో అందితే డబ్బు రికవర్ చేసే అవకాశం ఉంటుందని సూచించారు.

చదవండి : Cyberabad Police : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్