మోడీజీ.. వాస్తవంలోకి రండి: మీ మాట వింటాం.. మా మాట కూడా వినండి

మోడీజీ.. వాస్తవంలోకి రండి: మీ మాట వింటాం.. మా మాట కూడా వినండి

Updated On : April 3, 2020 / 7:14 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో మెసేజ్ ద్వారా ప్రత్యేక సందేశాన్ని పంపారు. ఆదివారం రాత్రి 9గంటలకు ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి క్యాండిల్స్ వెలిగించాలని.. లేదంటే దీపాలు, సెల్ లైట్ల వెలుతురును చూపిస్తూ 9నిమిషాలు పాటు బయటే ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వాళ్ల డోర్ల వద్దకు వచ్చి కాస్త సమయాన్ని కేటాయించాలని కోరారు 

దీనిపై ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రధాన షో మాన్ చెప్పిన మాట విన్నారు. ప్రజల బాధను నయం చేసే విషయం కాదు, వారి సమస్యలను తేలిక చేసి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చెప్పలేదు. భవిష్యత్ పై ధ్యాస లేదు, లాక్ డౌన్ ను పొడిగించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూమెంట్ కోసమే ఇలా చేస్తున్నారు. ఫొటోల కోసమే పని చేసే భారత ప్రధాని’ అంటూ ట్వీట్ చేశారు. 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా పేదలకు సాయం చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ లాంటివి ఇవ్వాలి. ప్రధాని నిజంలోకి రావాలి. లైట్లు ఆపేసి, బాల్కనీల్లోకి రావడమేంటి?

కాంగ్రెస్ లీడర్.. మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ట్వీట్ చేస్తూ.. మేం మీ మాట విని గుమ్మాలలోకి వచ్చి లైట్లు వెలిగిస్తాం. మీరూ మా మాట విని ఆర్థిక వేత్తల సలహాలు, సూచనలు పాటించండి. అని వెల్లడించారు. 

మార్చి 22న జనతా కర్ఫ్యూలో భాగంగా ఆ రోజు సాయంత్రం 5గంటలకు ప్రజలంతా గుమ్మాలలోకి వచ్చి ఇలానే చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్లు, నర్సులు, సివిల్ వర్కర్లతో పాటు కరోనాకు వ్యతిరేకంగా పోరాడే వారందరికీ అభినందనలు తెలిపేందుకు ఇలా చేయమని పిలుపునిచ్చారు. ఇది రెండో సారి. 

Also Read | తిండిలేక సొంతూరికి వెళ్తూ.. 500కిలోమీటర్లు నడిచాక చనిపోయాడు