అమ్మకానికి ప్రధాని మోడీ బహుమతులు 

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 10:32 AM IST
అమ్మకానికి ప్రధాని మోడీ బహుమతులు 

Updated On : September 14, 2019 / 10:32 AM IST

ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చిన మెమెంటోలు,బహుమతులను శనివారం (సెప్టెంబర్ 14)న ఢిల్లీలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. గత ఆరు నెలలుగా మోడీకి వచ్చిన గిఫ్టులను ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. అవి కావాలనుకుంటే వేలంలో పాడుకుని సొంతం చేసుకోవచ్చు. ప్రధానికి గత ఆరు నెలల నుంచి వచ్చిన  2,772 గిఫ్ట్ లు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో  2.5 లక్షలు విలువ కలిగిన అత్యంత ఖరీదైన పెయింటింగ్ కూడా ఉంది. ఇంకా ప్రధానికి వచ్చిన శాలువాలు…పలు విగ్రహాలు, శాలువాలు ఉన్నాయి.  

ఈ కార్యక్రమాన్నిమంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రధాని మోడీకి వచ్చిన గిఫ్టులను సొంతం చేసుకోవటానికి ఎంతో మంది ఆసక్తి చూపుతారనీ..ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు వినియోగించనున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమం ఈరోజు నుంచి  అక్టోబర్ 3 వరకు కొనసాగుతుందని మంత్రి తెలిపారు.