karnataka : కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా.. రెండు లైన్లు చదివి గవర్నర్‌ వాకౌట్‌..

karnataka : కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చదవకుండా పక్కన పెట్టారు. కేవలం రెండు లైన్లు మాత్రం చదివి తన ప్రసంగాన్ని ముగించారు.

karnataka : కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా.. రెండు లైన్లు చదివి గవర్నర్‌ వాకౌట్‌..

karnataka

Updated On : January 22, 2026 / 4:25 PM IST

karnataka : కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. కొత్త ఏడాదిలో కర్ణాటకలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చదవకుండా పక్కన పెట్టారు. కేవలం రెండు లైన్లు మాత్రం చదివి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.

Also Read: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. మీరు ఈ రకంగా విత్తనాలు వేస్తే రేపు వృక్షాలవుతాయ్.. వైఎస్ జగన్ హెచ్చరిక

గవర్నర్ సభ నుంచి వెళ్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను ఆపడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని చదవాలంటూ కోరారు. మరోవైపు బీజేపీ సభ్యులు గవర్నర్ తీరును అభినందించారు. భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు సైతం గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్ భవన్ బీజేపీ కార్యాలయంగా మారిందా..? అంటూ గవర్నర్ ను ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. గవర్నర్ ను అడ్డుకొనేందుకు వచ్చిన పలువురు కాంగ్రెస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు.

గవర్నర్ తన ప్రసంగంలో రెండు లైన్లు మాత్రమే ప్రస్తావించారు. ‘ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది.. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ తన ప్రసంగాన్ని ముగించి గవర్నర్ అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. క్యాబినెట్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవకుండా తాను సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని గవర్నర్ చదివారు. ఆయన రాజ్యాంగబద్దంగా వ్యవహరించలేదు. దీనిపై నిరసన తెలియజేస్తున్నాము. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉంటే.. అసెంబ్లీలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తీరు గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విబేధాలకు దారితీసింది.

ఇదిలాఉంటే.. రెండేళ్లుగా గవర్నర్ థావర్ చంద్ కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన సభా ప్రసంగాలను ఉభయ సభల్లో యథావిధిగా చదివారు. ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలతో తన ప్రసంగాన్ని సిద్ధం చేసిన తీరును ఆయన ముందుగానే ఆక్షేపించారు. దీంతో గురువారం ఆయన సభకు వస్తారా.. రారా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, సభకు వచ్చిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని చదవకుండా కేవలం రెండు లైన్లు మాత్రమే చదివి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.