ముడి చమురు ధరలు తగ్గాయి: రూ.3 ఎక్సైజ్ సుంకం పెంచి, లాభాన్ని ఖజానాలో వేసుకున్న ప్రభుత్వం

అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గగా.. పెట్రోల్, డీజెల్ ద్వారా వచ్చే లాభాలను ఖజానాలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని శనివారం(14 మార్చి 2020) లీటరుకు 3 రూపాయలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 2రూపాయల నుంచి 8 రూపాయలుకు, డీజిల్ విషయంలో 4 రూపాయలకు పెంచినట్లు అధికారిక నోటిఫికేషన్ ఇచ్చింది.
అదనంగా పెట్రోల్‌పై రోడ్‌సెస్‌ను లీటరుకు రూ .1 చొప్పున పెంచింది ప్రభుత్వం. ఎక్సైజ్ సుంకం పెరిగితే మాములుగా అయితే పెట్రోలు ధరలు పెరుగుతాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు ధరల క్షీణత కారణంగా పెద్దగా సామాన్యులకు మార్పు కనిపించదు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గగా.. చాలావరకు ఇది సర్దుబాటు పేరుతో చమురుకంపెనీలు, ప్రభుత్వాలు తీసేసుకొంటున్నాయి.
కేంద్ర చర్యలను ప్రతిపక్షాలు ఖండించాయి. పెట్రోల్ ధరలు తగ్గితే వాటిని ప్రజలకు మేలు చెయ్యకుండా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న సమయంలోనే వాటిని ప్రజల నెత్తిపై రుద్దడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read | ఢిల్లీలో ‘టీ’పార్టీ లాగానే ‘గోమూత్ర పార్టీ’..వెళితే ఫ్రీగా ఇస్తారట